ఫిల్మ్ ఇండస్ట్రీలో వ్యాక్సిన్ ఎంతమంది తీసుకున్నారు?

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రోజురోజుకు కేసులు లక్షల సంఖ్యలో పెరుగుతున్న తరుణంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

 Film Celebrities Who Took Covid Vaccine, Film Industry, Covid 19, Corona Vaccine-TeluguStop.com

ఇక అర్హులందరికీ వ్యాక్సిన్ అందించగా.ఇంకొన్ని చోట్ల లో వ్యాక్సిన్ అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.ఇక కొందరు సెలబ్రెటీలు వ్యాక్సినేషన్ అందుకోగా.

ఇప్పటి వరకు ఎంత మంది వాక్సినేషన్ తీసుకున్నారో ఒకసారి చూద్దాం.

ఇప్పటికే ఇండస్ట్రీలో 45 ఏళ్ల వయసున్న వాళ్ళు పలువురు తీసుకోగా.

ప్రస్తుతం తక్కువ వయస్సు వారు అర్హులు కానందున యంగ్ హీరోలు ఎవరు వ్యాక్సినేషన్ తీసుకోలేదు.అయితే ఇన్ఫ్లూయెన్స్ ఉపయోగిస్తే వయసుతో సంబంధం లేకుండా టీకాలు వేస్తున్నారని తెలుస్తుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులతోపాటు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

ఇక మరో స్టార్ హీరో నాగార్జున తను వ్యాక్సిన్ తీసుకున్నట్లు తన ట్విట్టర్ ద్వారా ఫోటో కూడా షేర్ చేశాడు.

ఇక మోహన్ బాబు కూడా వ్యాక్సినేషన్ తీసుకోగా.తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు కూడా వ్యాక్సిన్ తీసుకొమ్మని తెలిపారు.ఇక మహేష్ బాబు, అతని భార్య నమ్రత కూడా ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇక అల్లు అరవింద్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.

Telugu Allu Aravind, Chiranjeevi, Corona Wave, Corona Vaccine, Covid, Nadiya, Ma

ఇక సీనియర్ నటి నదియా కూడా వ్యాక్సిన్ తీసుకుంది.అంతే కాకుండా మరో సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిసిందే.ఇక మరో యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇటీవలే తను కూడా వ్యాక్సిన్ తీసుకోగా.తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

అంతేకాకుండా తన ఫాలోవర్స్ కూడా వ్యాక్సిన్ గురించి సలహా ఇచ్చింది‌.ఇక బాలీవుడ్ లో మాధురి దీక్షిత్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే‌.ఇక వీళ్ళు కూడా పూర్తిగా కోలుకున్న తరువాత వ్యాక్సిన్ తీసుకోనున్నట్లు సమాచారం తెలుస్తుంది.

ఇక కొందరు హీరోయిన్స్ కూడా వైరస్ బారిన పడగా.అర్హులు కానందుకు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube