కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ రోజా.. ఏం జరిగిందంటే..?

ఒకప్పుడు సినిమాల్లో నటించి వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న రోజా చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు.అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైప్పటికీ కామెడీ షో జబర్దస్త్ కు మాత్రం ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

 Mla Roja  Cried Due To That Telugu Anchor Father  Died Corona, Died Corona, Prad-TeluguStop.com

కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యల వల్ల రోజా రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఇంట్లోనే ఉండి రోజా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.

అయితే రోజా తాజాగా కన్నీళ్లు పెట్టుకున్నారని సమాచారం.బుల్లితెర యాంకర్ ప్రదీప్ తండ్రి కొన్నిరోజుల క్రితం కరోనాతో చనిపోయిన సంగతి తెలిసిందే.ఈ విషయం తెలిసి రోజా కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుస్తోంది.యాంకర్ ప్రదీప్ తో రోజా ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది.

రోజా పూర్తిగా కోలుకున్న తరువాత ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.మరోవైపు రోజా నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

నియోజకవర్గంలో ఒక టాస్క్ ఫోర్స్ సహాయంతో రోజా కరోనా సోకిన వాళ్లకు మందులు అందే విధంగా చర్యలు చేపట్టారని తెలుస్తోంది.కరోనా వల్ల చనిపోయిన వాళ్ల కొరకు రోజా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

రోజా మళ్లీ ఎమ్మెల్యేగా బిజీ అవుతుండటం గమనార్హం.త్వరలో రోజా ప్రదీప్ మాచిరాజు కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నారని తెలుస్తోంది.

Telugu Corona, Pradeep, Roja-Movie

ఎమ్మెల్యే పదవితో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవితో రోజా బిజీగా ఉండగా త్వరలో రోజాకు మంత్రి పదవి దక్కనుందని ప్రచారం జరుగుతుంది.జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత కేబినేట్ లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోగా రోజాకు స్థానం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.రోజాతో పాటు మరి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమకు కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube