మంచి అవకాశాన్ని చేజార్చుకుంటున్న కాంగ్రెస్ నాయకులు..మారేదెప్పుడు?

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో ప్రజలకు దూరంగా, విమర్శలకు దగ్గరగా నేతలు ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే వరుస ఎన్నికల్లో పరాజయం పాలవుతూ వస్తున్న కాంగ్రెస్ కు నాగార్జున సాగర్ అపజయం రాష్ట్ర వ్యాప్తంగా మరింత దెబ్బ తీసిందనే చెప్పవచ్చు.

 Congress Leaders Seizing A Good Opportunity  When Revanth Reddy, Telangana Congr-TeluguStop.com

ఇక ఈ ఓటమిపై బహిరంగంగా ఎవరు వ్యాఖ్యానించకపోయినా జానారెడ్డి స్పందిస్తూ ఓటమికి బాధ్యత వహిస్తున్నానని చెప్పి ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఎదగాలంటే అధికార పక్షం ఏదైనా తప్పు చేసినట్టు దొరికితే ఇక దాన్ని చక్కటి అవకాశంగా మలుచుకొని తమ పార్టీ ప్రతిష్టను పెంచుకునేలా వ్యూహాలను రచించాలి.

కాని కాంగ్రెస్ ఇప్పుడు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహారిస్తోంది.ఈటెల అంశం ఇంత పెద్ద రచ్చగా మారినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి ఈ విషయంపై ప్రజల్లో కదలిక సృష్టించి కాంగ్రెస్ మైలేజీ పెంచుకునేలా వ్యూహాలను సందించవచ్చు.

కాని కాంగ్రెస్ అలా చేయడం లేదు.ఇక కాంగ్రెస్ నాయకులు మారేలా లేరని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయడానికి వినియోగించకుంటే రాజకీయ పరిణితి లోపించిందనే అపప్రద వచ్చే ప్రమాదం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube