నీ వల్ల నా ప్రయాణం ఆగిపోయింది: ఆస్ట్రేలియా ప్రధానిపై కోర్టుకెక్కిన బెంగళూరు వాసి

కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ వణికిపోతోన్న సంగతి తెలిసిందే.గడిచిన కొద్దిరోజుల నుంచి దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు మించి కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.

 Australian Court To Examine India Travel Ban Plea By Man In Bengaluru, Australia-TeluguStop.com

ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై ఆయా దేశాలు నిషేధం విధించాయి.కానీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాత్రం కాస్తంత ఓవరాక్షన్ చేశారు.

మే 15 వరకు భారత విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్టు మోరిసన్ గత మంగళవారం ప్రకటించారు.భారత్ నుంచి వచ్చేవారితో పాటు సొంత దేశ పౌరులపైనా ఆయన బ్యాన్ విధించారు.ఇండియాలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు స్వదేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల పాటు జైలుశిక్ష, రూ.49 లక్షల వరకు జరినామా విధిస్తామని మోరిసన్ హెచ్చరించారు.అయితే ప్రధాని నిర్ణయంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Telugu Australian, Covid Effect, India, Primescott, Travel Ban-Telugu NRI

భారత్‌లో క్లిష్ట పరిస్థితుల మధ్య వున్న ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేయాలేకాని బెదిరించడం ఏంటని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ నిర్ణయం పట్ల అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి.నీకెంత ధైర్యం.

నీ చేతుల‌కు ర‌క్తం అంటుకుంది అని ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ మైకేల్ స్లేట‌ర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.అయితే ఈ నిషేధాన్ని మోరిసన్ సమర్థించుకున్నారు.

దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.ఆస్ట్రేలియాలో థర్డ్ వేవ్ విజృంభణ రాకుండా నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారిసన్ వెల్లడించారు.

Telugu Australian, Covid Effect, India, Primescott, Travel Ban-Telugu NRI

కాగా, ఆస్ట్రేలియా ప్రధాని నిర్ణయం వల్ల తన ప్రయాణం వాయిదా పడిందని ఓ భారతీయ వృద్ధుడు కోర్టుకెక్కాడు.దీనిని ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు విచారణకు స్వీకరించడం విశేషం.వివరాల్లోకి వెళితే… బెంగళూరుకు చెందిన ఓ 73 ఏళ్ల పెద్దాయన కొద్ది రోజుల క్రితం తాను భారత్ వచ్చానని.తిరిగి ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

అయితే భారత్‌పై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ప్రధాని మోరిసన్ తీసుకున్న నిర్ణయం వల్ల తన ప్రయాణం వాయిదా పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు.

ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube