అతడు నాకు ఇష్టం.. ఇప్పుడైన అతనితో సినిమా చేస్తానంటున్న నమిత!

తెలుగు సినీ నటి గుజరాతి బ్యూటీ నమిత.తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న పేరే.

 Manitha, Prithviraj Sukumaran, Favorite Hero, Tollywood, Favorite Hero, Manitha,-TeluguStop.com

తన అందానికి కాస్త గ్లామర్ ను అద్ది.మొత్తానికి గ్లామర్ బ్యూటీ గా మారింది.

ఇక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించింది ఈ బ్యూటీ.నమిత తన అందంలో 4వ స్థానంలో మిస్ ఇండియా గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

హీరో విక్టరీ వెంకటేష్ నటించిన జెమిని సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది.ఆ తర్వాత సొంతం సినిమాలో నటించగా.పలు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.ఇక ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో తన గ్లామర్ తో మాత్రం ప్రేక్షకుల మతి పోగొట్టింది.2016లో మన్యంపులి సినిమా లో చివరిసారిగా నటించగా.ఇక తన పెళ్లి తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంది.

ఇక మలయాళంలో ఎంతో అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.ప్రస్తుతం మరో సినిమాలో నటించింది. ఆర్ ఎల్ రవి దర్శకత్వంలో తెరకెక్కనున్న బొవ్ వావ్ అనే సస్పెన్స్ తో కూడిన థ్రిల్లర్ మూవీ తో కీలక పాత్రలో నటించింది.వాస్తవ కథ తెరకెక్కనున్న ఈ సినిమా బహుభాషా చిత్రం గా రూపొందనుంది.

ఈ సినిమా ప్రమోషన్ భాగంలో నమిత కొన్ని మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూలో పాల్గొనగా.మలయాళంలో తనకు ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్నతో.

తన మనసును దోచిన నటుడు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అని తెలిపింది.

అంతేకాకుండా తనతో నటించడానికి అవకాశం వస్తే ముందు వెనక ఆలోచించను అంటూ తన మనసులోని మాటను తెలిపింది.

ఇక ఈ సినిమా లో తన పాత్ర గురించి తెలుపుతూ.ఇందులో తాను కీలక పాత్ర పోషిస్తున్నానంటూ, తన పాత్ర చుట్టే కథ కొనసాగుతుందని ఓ బాధితురాలని కాపాడేందుకు వచ్చిన దేవుడి చుట్టూ ఈ సినిమా సాగుతుందని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube