ట్రంప్‌ ఖాతాపై నిషేధం కరెక్టే.. కానీ: ఫేస్‌బుక్ బోర్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇప్పట్లో కష్టాలు వదిలేలా కనిపించడం లేదు.క్యాపిటల్ భవనంపై ఆయన వర్గీయుల దాడితో వున్న కాస్త పరువు గంగ పాలైంది.

 Facebook Oversight Board Upholds Trump Ban, Calls For More Review, Trump, Facebo-TeluguStop.com

ఈ ఘటనతో తమ నిబంధనలు ఉల్లంఘించారంటూ సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ ఖాతాను బ్లాక్ చేశాయి.అయితే వీటిలో ఒక అడుగు ముందుకేసిన ట్విట్టర్ ఆయన ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.

దీనిపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా ఆ సంస్థలు వెనక్కి తగ్గలేదు.తాజాగా ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతాను స్తంభింపజేయడం సరైన నిర్ణయమేనని ఆ సంస్థకు చెందిన స్వతంత్ర పర్యవేక్షక సంస్థ ‘ఓవర్ సైట్ బోర్డు’ స్పష్టం చేసింది.

అయితే, మాజీ అధ్యక్షుడి ఖాతాను నిరవధికంగా నిలిపివేసేందుకు అనుమతించాలన్న ఫేస్‌బుక్ అభ్యర్థనను మాత్రం బోర్డ్ డైరెక్టర్ థామస్ తోసిపుచ్చారు.

ఫేస్‌బుక్ ఏళ్లుగా పాటిస్తున్న నిబంధనలు, పాలసీలకు విరుద్ధంగా ట్రంప్ ఖాతాపై సస్పెన్షన్‌ను శాశ్వతంగా కొనసాగించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరు నెలల తర్వాత గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని థామస్ సూచించారు.ఇదే సమయంలో కేపిటల్ ఘటన జరిగిన వెంటనే ట్రంప్‌పై తగిన విధంగా జరిమానా విధించడంలో ఫేస్‌బుక్ విఫలమైందని ఆయన మండిపడ్డారు.

భవిష్యత్తులో ప్రభుత్వాధినేత కానీ, అత్యున్నత అధికారి కానీ ఈ తరహా సందేశాలు పెడితే కనుక ఆ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయడమో, లేదంటే శాశ్వతంగా తొలగించడమో చేయాలని ఫేస్‌బుక్ బోర్డు సూచించింది.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని మరి వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.

వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో ట్రంప్ వ్యవహారశైలిపై అమెరికన్లు భగ్గుమన్నారు.చట్టసభ సభ్యులైతే జనవరి 20కి ముందే పదవిలోంచి దించాలని పావులు కదిపారు.

ఇదే సమయంలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ ఖాతాను బ్లాక్ చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube