వైరల్ : కొవిడ్ సమయంలో శునకం అరెస్ట్.. ఎందుకంటే..?

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్  విజృంభణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజురోజుకి అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నయి.

 Viral: Dog Arrested During Kovid Because  Dog Arrest, Indore, Madhya Pradesh, Ca-TeluguStop.com

ఈ క్రమంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టడంతో పాటు లాక్ డౌన్ , కార్ఫ్యూ లాంటి రూల్స్ ను అమలు చేస్తున్నారు.ఈ తరుణంలో  తాజాగా మధ్యప్రదేశ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.

అది ఏమిటంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నియంత్రించేందుకు కరోనా నిబంధనలను పకడ్బందీగా పాటిస్తున్న క్రమంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా తాజాగా నిబంధనలను అధిగమించి బయట తిరుగుతున్న ఒక కుక్కను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు ఆ కుక్కతో పాటు సదరు యజమానిని కూడా మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి  వివరాల్లోకి వెళితే కరోనా కారణంలో మధ్యప్రదేశ్ లో కఠిన లాక్ డౌన్ అమలు అవుతున్న వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఇందోర్​ లోని పలాసియా ప్రాంతంలో మనీశ్​ సింగ్ అనే వ్యక్తి, తన పెంపుడు జంతువు కుక్కను తీసుకొని రోడ్డుపై సంచరిస్తున్న వేళ పోలీసుల కంట పడ్డారు.

కరోనా నిబంధనలను  అధిగమించిన కారణంతో ఆ శునకాన్ని , యజమాని మనీశ్ ను ఇద్దర్ని కూడా అరెస్ట్ చేశారు.  చివరికి వారు చేసింది తప్పు అని ఒప్పుకొని మన్నించమని మనీశ్ మొరపెట్టుకోగా పోలీసులు మనీశ్ , కుక్కను వదిలి పెట్టారు బాధితుని అభ్యర్థన మేరకు పోలీసులు మనీశ్ ని గట్టిగా హెచ్చరించి విడిచిపెట్టారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కథనం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube