కౌంటింగ్ కేంద్రంలో వధువు.. ఎందుకంటే.?

పెళ్లి అనేది ఓ అపురూప ఘట్టం.అందుకే చాలా మంది పెళ్లిని ఘనంగా చేసుకుంటారు.

 Bride In Uttarpradesh Runs To Polling Counting Center To Receive Victory Certifi-TeluguStop.com

ఇక్కడ కూడా ఓ పెళ్లి వైభవంగానే జరిగింది.అయితే పెళ్లికూతురు పెళ్లి మధ్యలో హుటాహుటిన లేచి పరుగులు తీసింది.

పెళ్లి వేడుకను మధ్యలో వదిలేసి ఓట్ల లెక్కింపు జరుగుతున్న కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిని సంగతి తెలిసిందే.రాంపూర్‌లోని మిలాక్ బ్లాక్‌లోని ముహమ్మద్‌పూర్ జదీద్ గ్రామానికి చెందిన పూనమ్ శర్మ.

బీడీసీ ఎన్నికల్లో 135‌వ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె పెళ్లి మే 2వ తేదీన నిశ్చయించారు.

అయితే అదే రోజు పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది.దీంతో ఆ వధవు తన పెళ్లి వేడుకను మధ్యలో వదులుకుని కౌంటిగ్ జరుగుతున్న చోటుకి చేరుకుంది.

ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆమె ఆనందరం రెట్టింపు అయింది.

దీంతో విక్టరీ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఆమె నవీన్ మండిలోని మత్‌గడ్నా‌కు చేరుకునింది.

అక్కడ అధికారుల నుంచి విక్టరీ సర్టిఫికేట్‌ను అందుకుంది.తాను బరేలి జిల్లాకు చెందిన రింకును పెళ్లి చేసుకుంటున్నట్టు ఆమె తెలిపారు.

పెళ్లి రోజు ఈ రకమైన ఆనందం ఎదురవుతుందని ఊహించలేదని చెప్పారు.తన ప్రత్యర్థి ముకేష్‌పై 31 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు చెప్పారు.

తన ప్రాంతాన్ని అభివృద్ది చేయనున్నట్టు, సమస్యలను పరిష్కరించనున్నట్టు తెలిపారు.మరోవైపు కోవిడ్ నిబంధనలకు అనుగునంగా ఆమె పెళ్లి వేడుక సంబందించిన ఏర్పాట్లను కుటుంబ సభ్యులు పూర్తిచేశారు.

తన విక్టరీ సర్టిఫికేట్ అందుకున్న తర్వాత పూనమ్ శర్మ వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.పెళ్లి రోజే తాను విజయం సాధించడంతో వధువు ఆనందానికి అవధుల్లేవు.

గ్రామస్తులు కూడా ఆమెకు ప్రసంశలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube