శవాల మీద ఆడుకుంటున్నారు.. ఆర్పీ పట్నాయక్ ఆవేదన...

దేశంలో కరోనా వల్ల దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉన్నా వ్యాక్సిన్ వేయించుకోకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లకు పాజిటివ్ నిర్ధారణ అయితే వాళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది.

 Music Director Rp Patnaik Emotional Over Corona Deaths, Music Director Rp Patnai-TeluguStop.com

ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన ఆర్పీ పట్నాయక్ కరోనా వల్ల దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

చైనాలోని వుహాన్ ను గతంలో ప్రపంచం ఏ విధంగా చూసిందో ప్రస్తుతం ప్రపంచం భారత్ ను అదే విధంగా చూస్తోందని ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు.

బెడ్ దొరకట్లేదని ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేసిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సిబ్బందిపై దాడి చేయడంవల్ల మిగతా వాళ్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆర్పీ పట్నాయక్ వెల్లడించారు.కరోనా కంటే ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందంటూ ఆర్పీ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా వల్ల ఎంతోమంది కుటుంబ సభ్యులను కోల్పోతున్నారని సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆర్పీ పట్నాయక్ వెల్లడించారు.కొంతమంది ఫోన్ చేసి బెడ్ కావాలని అడుగుతున్నా సహాయం చేయలేకపోతున్నానని కరోనా మరణాలకు సంబంధించిన వాస్తవ లెక్కలు శ్మశానాలలో మాత్రమే కనిపిస్తున్నాయని ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు.

క్యూ లైన్ లో శవాలు ఉన్న పరిస్థితి నెలకొందని దేశంలో దౌర్భాగ్యపు రాజకీయ నాయకులు ఉన్నారని వాళ్లు శవాలతో ఆడుకుంటున్నారని ఆర్పీ పట్నాయక్ అన్నారు.ఎన్నికలపై పెట్టే శ్రద్ధలో ఒక్క శాతం ప్రజలపై పెట్టాలని ఆర్పీ పట్నాయక్ సూచనలు చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సూచనలకు నెటిజన్లు సైతం తమ మద్దతును ప్రకటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube