సుపర్ : కరోనా సమయంలో తన అక్కతో కలిసి అలాంటి పని చేసిన యంగ్ హీరో...

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు సాయి కుమార్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ కి డబ్బింగ్ కూడా చెప్పి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Telugu Hero Aadi Sai Kumar And Her Sister Giving Suggestion To Parents For Coron-TeluguStop.com

ఇక సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా బాగానే రాణిస్తున్నాడు.అలాగే సాయి కుమార్ కూతురు జ్యోతిర్మయి కుమార్ వైద్య వృత్తిని చేపట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆసుపత్రిలో పని చేస్తోంది.

తాజాగా ఆది సాయి కుమార్ మరియు జ్యోతిర్మయి కుమార్ కలిసి తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో చిన్నపిల్లలకి కరోనా వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై చర్చించి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

దీంతో సాయి కుమార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారని కాబట్టి కనీసం ఇప్పటికైనా చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలకి చాలా ఉపయోగపడే పని చేసినందుకు ఆది సాయి కుమార్ మరియు జ్యోతిర్మయి కుమార్ లని అభినందిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఆది సాయి కుమార్ తెలుగులో “శశి” అనే చిత్రంలో హీరోగా నటించాడు.

ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.కానీ ఈ చిత్రంలోని “ఒకే ఒక లోకం నువ్వే” పాట దాదాపుగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది.

అంతేకాకుండా ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రేడింగ్ అవుతోంది.కాగా ప్రస్తుతం ఆది సాయి కుమార్ తెలుగులో “జంగిల్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube