పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన మిస్​ ఇండియా ఫైనలిస్ట్​..!

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం తేలింది.ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్​పుర్​ జిల్లా బక్షాలో పంచాయతీ ఎన్నికల బరిలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ దీక్ష పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 Miss India Finalist Diksha Singh Lose In Up Panchayat Polls , Diksha Sing, Heroi-TeluguStop.com

అయితే ఎన్నిక ల రిజల్ట్స్ రాగా ఆవిడకు కేవలం రెండు వేల ఓట్లు పోల్ అవడంతో ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది.

ఇక ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసిన నాగిన సింగ్ మొత్తంగా ఐదు వేల ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించాడు.

దీక్షా మహిళల సంక్షేమం, మౌలిక వసతులు కల్పన లాంటి ప్రధాన అంశాలను తన అస్త్రంగా చేసుకొని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన గాని చివరికి దీక్ష సింగ్ జిల్లా పంచాయతీ పదవిని చేజిక్కించుకోలేకపోయారు.ఇక దీక్ష తన బాల్యంలోనే వారి కుటుంబం జౌన్​పుర్ జిల్లా బక్షా ప్రాంతంలోని చిట్టోరీ గ్రామం నుండి ముంబైకి వలస వచ్చారు.

ఇక 2015 లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో దీక్ష పాల్గొని ఆ సంవత్సరానికి రన్నరప్ గా నిలిచింది.ఆ తర్వాత ఆవిడ కొన్ని బాలీవుడ్ సినిమాలలో, అలాగే మరికొన్ని వాణిజ్య ప్రకటనలలో కూడా ప్రేక్షకులను అలరించింది.

ఈవిడ కేవలం నటన మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రాయడం లోనూ తన ప్రతిభను కనపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube