కలెక్టర్ ఫేస్‌బుక్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అంతటితో ఆగకుండా.. !

దేశంలో దొంగలు పడ్డారు అనే చిత్రం ఉందన్న విషయం తెలిసిందే.కానీ అది నిజమే అవుతుంది.

 Cyber ​​criminals Hacked Collector Facebook, Vijayanagaram, Collector, M Har-TeluguStop.com

ప్రస్తుతం దేశంలో దొంగలు పడ్డారు.అందినకాడికి దోచుకుంటున్నారు.

ఇక ఆ దొంగతనాలు చేసే తీరును బట్టి వారి వృత్తికి పేర్లు కూడా పెట్టింది సమాజం.ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చిన కొత్త నేరగాళ్ల పేరు సైబర్ నేరగాళ్లు అని పెట్టారు.

వీరు కంటికి కనిపించరు గానీ చేతికి చిక్కినవారిని చిక్కినట్లుగా దోచుకుంటారు.

ఇకపోతే ఈ సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతుండటంతో బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది.

ఇక సామాన్యుల దగ్గరి నుండి అధికారుల వరకు ఎవరిని వదలడం లేదు.తాజాగా విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్ ఫేస్‌బుక్ ఖాతాను హాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆ అకౌంట్ నుండి కొంత మందికి డబ్బులు కావాలని మెసేజ్‌లు పెట్టడంతో ఏం అవసరం వచ్చిందో అని అతని స్నేహితులు నేరగాళ్లు డిమాండ్ చేసిన రూ.10 వేలు, రూ.15 వేలు పంపిచారట.అయితే ఈ విషయం కాస్త కలెక్టర్‌కు దృష్టికి వెళ్లడంతో వెంటనే తన ఫేస్‌బుక్ ఖాతాను మూసేసిన కలెక్టర్ హరిజవహార్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చూసారా ఇలాంటి మేసేజ్‌లు వస్తే ఫస్ట్ ఫోన్ చేసి తెలుసుకోవడం మంచిది.లేదా అనుమానం ఉంటే పోలీసులను సంప్రదించండని చెబుతున్నా మోసపోయే వారు మోసపోతూనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube