వైసీపీ సీనియర్ల బాధ తీర్చేవారేరి ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో  వ్యవహారం అంతా సాధారణంగానే ఉన్నట్లు గా కనిపిస్తున్నా, సీనియర్ నాయకులలో మాత్రం తీవ్ర అసంతృప్తి ఆగ్రహం కనిపిస్తున్నాయి.ముఖ్యంగా పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది జగన్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.

 Ysrcp Seniour Leaders Angry On Jagan Behaviour, Ap,  Ap Government,  Jagan,  Par-TeluguStop.com

పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచి, ఆర్థికంగా, సామాజికంగా జగన్ కు అన్ని రకాలుగా అండదండలు అందించి , పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమవంతు కృషి చేసిన వారు ఎంతో మంది ఉన్నారు.అయితే వారికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మాత్రం దక్కాల్సిన గౌరవం, పదవులు దక్కడంలేదు అనే బాధ వైసిపి సీనియర్ లలో ఎక్కువగా కనిపిస్తోంది.2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత,  తమకు మంత్రి పదవులు వస్తాయని పార్టీ సీనియర్లు చాలామంది భావించినా, జగన్ సరికొత్త ఫార్ములాతో ముందుకు వెళ్లారు.

 సామాజిక వర్గాల సమతూకం అంటూ జూనియర్ లను, పెద్దగా పార్టీలో ప్రభావం లేని వారిని, కొత్తగా ఎన్నికల్లో గెలిచిన వారిని, ఇలా సామాజిక వర్గాల వారీగా జగన్ ఎంపిక చేశారు.

అయితే ఆ కోటా కారణంగా సీనియర్ ఎమ్మెల్యే లకు పదవులు దక్కలేదు.అలాగే ఎన్నికల సమయంలో జగన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సీట్లను సైతం వదులుకున్న వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంత్రిని చేస్తానని జగన్ ఎంతోమందికి హామీలు ఇచ్చారు .అయితే కొంతమందిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసినా, మంత్రి పదవుల విషయంలో జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.అయితే తమ నియోజకవర్గాల్లో సమస్యలు,  నిధులు విషయమై సీనియర్ ఎమ్మెల్యేలు తమకంటే జూనియర్లు, 

Telugu Ap, Jagan, Ysrcp-Telugu Political News

 ఇదే కాదు ఇటీవల జరిగిన మున్సిపల్,  కార్పొరేషన్ ఎన్నికలలోనూ ,ఎమ్మెల్యేలుగా తాము చెప్పిన వారికి చైర్మన్ పదవులు ఇవ్వకుండా మొత్తం అధిష్టానం ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం వంటివి  సీనియర్ ఎమ్మెల్యేలకు ఆగ్రహం కలిగిస్తోంది.జగన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తమవుతున్నా, ప్రస్తుతం వైసిపి గాలి రాష్ట్రమంతా విస్తుండటం తో వేరే పార్టీల్లోకి వెళ్లే సాహసం చేయడం లేదు.పార్టీలోనే ఉంటూ తమ అసంతృప్తిని రకరకాల మార్గాల ద్వారా వ్యక్తం చేస్తూ ఈ మూడేళ్ల కాలం లో అయినా తమకు ప్రాధాన్యం దక్కుతుందా లేదా అనే టెన్షన్ లో ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube