ఐపిఎల్ - 14 సీజన్ నిరవధిక వాయిదా..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలాంటి పరిస్థితుల మధ్య తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

 Ipl 14 Season Indefinite Postponed Ipl 2021, Rajiv Sukla, Coronavirus, Players,-TeluguStop.com

గత మూడు రోజుల నుంచి ఐపీఎల్ లో కరోనా కేసులు మరింత ఎక్కువ కావడంతో ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.వివిధ జట్ల లలోని కీలక ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ 14 సీజన్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ఓ ప్రకటనను తాజాగా విడుదల చేశారు.

ఓవైపు దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తున్న సరే ఐపీఎల్ యాజమాన్యం ఐపీఎల్ మ్యాచ్ లను ఎంతో జాగ్రత్తగా లో ఆటగాళ్లను ఉంచి మ్యాచ్లను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఐపీఎల్ లో ఉన్న వివిధ జట్ల ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అర్థమవుతుంది.

ఒకవైపు ఆటగాళ్లకు కరోనా సోకిన సీజన్ జరుగుతే ముందు ముందు అనేక ఆటంకాలు నడుమ ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య ఉంటుందన్న నేపథ్యంలో ముందుగా ఐపీఎల్ సీజన్ ను నిరవధిక వాయిదా వేయడం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుతెలుస్తోంది.

Telugu Coronavirus, Ipl, Rajiv Sukla-Latest News - Telugu

అయితే పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ముందు షెడ్యూల్ ని యధాతదంగా ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తారని తెలుస్తోంది.తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు వృద్ధిమాన్ సాహా కూడా కరోనా బారిన పడ్డాడు.ఈ విషయం క్రికెట్ అభిమానులకు కాస్త చేదు వార్త అని చెప్పవచ్చు ఏదేమైనా ఆటగాళ్ళందరూ నిర్ణీత సమయంలో కోలుకోవాలని కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube