మీ జీవితాలను లైట్‌ తీసుకోకండి అంటున్న హీరోయిన్..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.రోజురోజుకీ కరోనా కేసులు భారతదేశంలో విలయతాండవం చేస్తూ అనేక మందిని బలితీసుకున్న సంగతి మనకు విదితమే.

 The Heroine Who Says Don't Take Your Lives Lightly, Tollywood, Coronavirus, Kurt-TeluguStop.com

ఒక రోజుకి దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కొత్త కరోనా కేసులు నమోదు అవ్వడం చూస్తే భారతదేశంలో కరోనా వైరస్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేశంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు ఉండడంతో ఆక్సిజన్ కోసం చాలామంది చావు బతుకుల మధ్య ఎందరో పోరాడుతున్నారు.

పరిస్థితులు ఇలా ఉండగా ప్రస్తుతం దేశంలోని పరిస్థితులను అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి.ఇళ్లు దాటి ఇబ్బందులకు గురి కావద్దు అంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి కర్బందా ప్రజలను అభ్యర్థించింది.

దీనికి కారణం తాను అనుభవించిన బాధ మరి ఎవరికి రాకూడదు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.ఇందులో భాగంగానే తాను గత గడచిన 48 గంటల్లో తాను, తన కుటుంబ సభ్యులు ఎంత నరకం అనుభవించామో.

అలాంటిది మీ వరకు వస్తే కానీ ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదు.కాబట్టి దయచేసి ఇంట్లోనే ఉండండి అంటూ తెలుపుతూనే మీరు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు మీ ప్రాణాన్ని రిస్క్ లో పెడుతున్నారని గ్రహించి బయటికి వెళ్లకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి అని తెలుపుతుంది.

ముఖ్యంగా మీ ప్రాణాలను లైట్ తీసుకోకండి అంటూ కృతి ప్రజలను హెచ్చరిస్తుంది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ తాజాగా ఈ హీరోయిన్ కుటుంబమంతా కరోనా బారిన పడినట్టు ఉందని అర్థమవుతోంది.

ఇదివరకు కృతికర్బంధ టాలీవుడ్లో ఒంగోలు గిత్త, తీన్మార్, బ్రూస్ లీ లాంటి చిత్రాలలో నటించింది.సౌత్ ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ భాషల్లో కూడా ఈవిడ నటించింది.

కానీ ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు ఆమెకు ఎక్కువ కావడంతో ఆవిడ బాలీవుడ్ వైపు మొగ్గుచూపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube