సుపుత్రుడితో పాండ్యా..వీడియో వైరల్

టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కొడుకు అగస్త్య ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఐపీఎల్‌ లో పాండ్యా సోదరులు ముంబై ఇండియన్స్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

 Viral Video-hardik Pandya With His Son Hardik Pandya, Natasha, Viral Video, Vira-TeluguStop.com

బయో బబుల్‌ లో ఉన్న మ్యాచ్‌ నుంచి విరామం లభించడంతో పాండ్య బ్రదర్స్‌ హార్దిక్‌, కృనాల్‌ ఒక్కచోట చేరి సరదాగా సమయం గడిపారు. కృనాల్ భార్య పంకూరి శర్మ, హార్దిక్‌ వైఫ్‌ నటాశా స్టాంకోవిచ్‌ లతో కలిసి అగస్త్య స్విమ్మింగ్‌ పూల్‌ లో ఎంజాయ్‌ చేశాడు.

ఈ సందర్భంగా తీసిన ఫొటోలను నటాశా ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేయగా హార్దిక్‌ ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు.మరోవైపు అగస్త్య తన పెద్దనాన్న కృనాల్‌ తోనూ పూల్‌ లో కేరింతలు కొట్టాడు.

వీరిద్దరూ పూల్‌ లో ఉండగా అగస్త్య తన తండ్రి హార్దిక్‌ ను చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో తెగ వైరల్‌ అవుతోంది.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటే.

హార్దిక్.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు.

ఇప్పుడు షేర్ చేసిన ఓ పోస్టుతో సోషల్ మీడియాలో నెటిజన్లను గెలిచేశాడు.ధోనీ, కృనాల్ తో కలిసి దిగిన ఫొటో పోస్టు చేసి వావ్ అనిపించుకున్నాడు.

ఎందుకంటే అందులో మై బ్రదర్స్ అని రాసి ఓ హార్ట్ ఎమోజీ పెట్టాడు.ఆ ఫోటోలో హార్దిక్, కృనాల్ లు ముంబై ఇండియన్స్ జెర్సీలో ఉండగా.

ధోనీ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ఉన్నాడు.కొద్ది సమయం క్రితం షేర్ చేసిన ఇమేజ్ నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ పొందింది.

తాజాగా నటాషా.హార్దిక్ , కొడుకు అగస్త్య కు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘ నా సర్వస్వం’ అనే క్యాప్షన్ కూడా పెట్టారు.ఆ వీడియో చాలా క్యూట్ గా ఉంది.

కొడుకుతో కలిసి హార్దిక్ ఆడుకుంటున్నాడు.హార్దిక్ హావభావాలు, దానికి అగస్త్య రియాక్షన్ చాలా క్యూట్ గా ఉంది.

దీంతో ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube