ఆక్సీజన్ పెట్టాడని యువకునిపై కేసు...అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే?

కొన్ని కొన్ని సార్లు జరిగే ఘటనలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆగ్రహానికి గురి అయ్యేలా ఉంటాయి.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.

 The Case Against The Young Man Who Put Oxygen What If You Know The Real Twist Vi-TeluguStop.com

ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.ఎక్కడ ఏ ఆసుపత్రి చూసినా ఆక్సీజన్ కొరతతో కొట్టి మిట్టాడుతూ, మన దేశంలో ఉన్న ఆక్సీజన్ సరైన సమయంలో అందక, అదే సమయంలో ప్రపంచ దేశాలు కూడా భారత్ కు ఆక్సీజన్ ను ఇతర వైద్య పరికరాలను అందిస్తూ భారత్ ను కరోనా నుండి బయట పడేయడానికి భారత్ మిత్ర దేశాలు సహాయం అందించాయి.

అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో పెద్ద పెద్ద వారే కాక, సామాన్యులు సైతం సహాయం చేయడానికి ముందుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి.అయితే  ఈ క్లిష్ట సమయంలో సహాయం చేసే వారిని ప్రోత్సహించాలే తప్ప నిబంధనల పేరుతో కట్టడి చేస్తే బాధితులకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంటుంది.

తాజాగా యూపీ పోలీసులు చేసిన ఓ పనికి నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జౌనపూర్ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఉచితంగా ఆక్సీజన్ అందిస్తున్న యువకుడిపై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడని కేసు నమోదు చేశారు.

కేసు నమోదు చేయడానికి అసలు కారణం యువకుడు కోవిడ్ పరీక్ష చేయకుండానే బాధితులకు ఆక్సీజన్ సరఫరా చేసిన నేరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube