విజయోత్సవాలకు నో పర్మిషన్..!

ఏప్రిల్ 30న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరుగనుంది.వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ తో పాటుగా మరో ఐదు మున్సిపాలిటీల్లో ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి.

 No Celebrations After Corporation Results, Bjp , Congres , Corporation,  Khammam-TeluguStop.com

వాటి ఫలితాలు నేడు వెల్లడవుతాయి.అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుప్రీం కోర్ట్, రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం గెలిచిన అభ్యర్ధులు విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాలు కాల్చడానికి అనుమతులు లేవు.

కాదు కూడదు అని నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు.ఆదివారం రాత్రి నుండి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా కౌంటింగ్ సమయాల్లో గొడవలు లేకుండా చూడాలని హెచ్చరించారు.

కౌంటింగ్ కేంద్రాలలో కూడా పోటీ చేసిన అభ్యర్ధితో పాటుగా ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.శాంతి బధ్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఈ నెల 9 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఫలితాల్లో టీ.ఆర్.ఎస్ పార్టీ ముందంజలో ఉంది.అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తామని చెప్పిన ప్రతిపక్ష పార్టీలు పోటీలో వెనకపడ్డాయి.

ప్రస్తుతానికి కౌంటింగ్ కొనసాగుతుండగా తుది ఫలితాలు తెలిసే వరకు ఏ పార్టీ ఎన్ని డివిజన్లు గెలిచింది అన్నది చెప్పడం కష్టం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube