వైరల్ : ఆ నీటిని తాకితే రాయిగా మారిపోతారు.. ఎక్కడో తెలుసా..?

గతంలో విఠలాచార్య, సముద్రాల, వంటి పాత తరం సినిమా డైరెక్టర్ల సినిమాల్లో మాయలు మంత్రాలూ, ఫిక్షన్ వంటి సన్నీవేశాలు చూసాం.ఇంకా చెప్పాలంటే మాయలు మంత్రాలూ వంటివి అన్నమాట కానీ ఇక్కడ చూస్తే మాయ లేదు మంత్రం లేదు.

 Viral  If You Touch That Water, It Will Turn To Stone Do You Know Somewhere, Vir-TeluguStop.com

ఉన్నది నిజం మాత్రమే.ఇక్కడ ఓ సరస్సులో నీటిని తాగితే శిలలుగా మారిపోతారనేది నిజం.

ఆఫ్రికాలోని టాంజానియాలో గల నేట్రాన్‌ సరస్సులో నీటిని తాకిన ప్రతి జీవి శరీరంలోని కణ కణాన్ని రాతి శిలగా మార్చేస్తుంది.ఆఫ్రికన్ దేశమైన ఉత్తర టాంజానియాలో నేట్రాన్ సరస్సు గురించి చెప్పబడింది.

ఈ సరస్సులోని నీటిని తాకినందున జంతువులన్నీ రాయిగా మారతాయి.శాస్త్రీయ దృక్కోణంలో నాట్రాన్ సరస్సులోని నీటి ఆల్కలీన్ పిహెచ్ 10.5 కు సమానం.ఇది కాస్టిక్‌గా ఉంటుంది.

నీటిని తాకిన వెంటనే జంతువుల చర్మం, కళ్ళను కాల్చేస్తుంది.నీటి క్షారత అయిన సోడియం కార్బోనేట్ ఇతర ఖనిజాల నుంచి వస్తుంది, ఇవి చుట్టుపక్కల కొండల నుంచి సరస్సులోకి ప్రవహిస్తాయి.

ఈ సరస్సు నీటిలో చాలా ఎక్కువ ఉప్పు, సోడా ఉన్నాయి.

శరీరం రాతిగా మారిపోతున్న సమయంలో ఆ పక్షులు నరకయాతన పడుతాయని సమాచారం.

ఇటువంటి పరిణామాలకి కారణం పక్కనే ఉన్న అగ్నిపర్వతం సోడియం కార్బోనేట్‌, సోడియం బై కార్బోనేట్‌(సోడియం సోడా)ల ప్రభావంతోనే జీవులు శిలలుగా మారిపోతున్నాయి.అంతేకాకుండా సరస్సు రంగు కూడా లేత గులాబీ వర్ణంలోకి మారిపోయింది.

కాగా, సరస్సులోని నీరు ఎప్పుడూ 140 డిగ్రీల వేడితో ఉంటుందని శాస్త్రవేత్తలుఅంటున్నారు.నీటిలో సోడా, ఉప్పు అధికంగా ఉండటం వల్ల చనిపోయిన మృతదేహాలు ఇప్పటికి అలాగే సురక్షితంగా ఉన్నాయి.

తూర్పు ఆఫ్రికాలో కనుమరుగవుతున్న జంతువులపై రాసిన ‘అక్రోస్ ది రావేజ్డ్ ల్యాండ్’ పుస్తకంలో ఈ సరస్సు గురించి చెప్పబడింది.సరస్సు ఉష్ణోగ్రత కూడా 60 డిగ్రీల వరకు ఉంటుందన్నారు.

అగ్నిపర్వత బూడిదలో కనిపించే మూలకం ఈ నీటిలో కనిపిస్తుందని చెప్పారు.మమ్మీలను భద్రపరచడానికి ఈజిప్టులు ఈ నీటిని వాడేవారని తెలుస్తోంది.

మొత్తానికి ఇటువంటి సరస్సును చూసి చాలా మంది ఆశ్చర్యపోవడమే కాదు భయపడిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube