వైరల్.. నడిరోడ్డుపై అమ్మాయిలకు పోలీసుల పనిష్మెంట్.. ఎందుకంటే?

ప్రస్తుతం కరోనా విజృంభణ దృష్ట్యా ప్రజలందరూ అత్యవసరమైతేనే బయటికి రావాలని, అవసరం లేకుండా జన సమూహాల మధ్య తిరగవద్దని ప్రభుత్వం, పోలీసులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉన్నారు.అయినా కొంత మంది కరోనా నిబంధనలు మాకేవీ పట్టావన్నట్టుగా యథేచ్ఛగా తిరిగేస్తుంటారు.

 Viral Police Punishment For Girls On The Highway For Violating Covid Restriction-TeluguStop.com

అయితే ఇలా నిబంధనలు ఉల్లంగిస్తూ పట్టుబడ్డ వారిలో అబ్బాయిలే ఎక్కువగా మనకు కనిపిస్తారు.కాని ఈసారి యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించింది అబ్బాయిలు కాదు.

అమ్మాయిలు.అవును మీరు చూసింది నిజమే.

అబ్బాయిలు పట్టుబడితే ఫైన్ వేసి బండ్లు సీజ్ చేసి, లాటీలకు పని చెబుతారు.కాని అమ్మాయిలు పట్టుబడితే ఏం చేస్తారని అనుకుంటారు.

అయితే పట్టుబడ్డ ఈ అమ్మాయిలను నడిరోడ్డు మీద గుంజీలు తీయించారు.ఆ సదరు అమ్మాయిలు ఎంత బ్రతిమిలాడినా పోలీసులు వాళ్లకు పనిష్ మెంట్ ఇచ్చే వరకు వదలలేదు.

ఇక కరోనా సమయంలో ప్రజలు పిట్టల్లా రాలుతున్నా ఇలా యాధేచ్చగా తిరగడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

వీరికి తగిన శాస్తి జరిగిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.పోలీసులు అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా శిక్షించడం భినందించాల్సిన విషయమని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా చేయడం వల్ల కొద్ది మందిలోనైనా భయం పుడుతుందని ఆ సదరు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube