ఆ రాష్ట్ర ఎమ్మెల్యేగా గెలిచిన టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. !

రాజకీయాలు చేయాలంటే ఒక ప్రత్యేకమైన అర్హత అంటూ ఏం లేదని ప్రతి వారికి తెలిసిందే.అందుకే గల్లీ గుండా నుండి, సినిమా, స్పోర్ట్స్, హంతకులతో పాటుగా ఏ రంగం వారైనా పొలిటిషియన్‌గా మారవచ్చూ.

 Former Team India Cricketer Manoj Tiwary Won As Mla In West Bengal Elections, Fo-TeluguStop.com

ఒక డాక్టర్, ఐపీయస్, లేక ఇతర ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే మాత్రం ఎన్నో నిబంధనలు, చదువులు కావాలి.కానీ ఆ ప్రభుత్వాన్ని నడిపే నేతకు మాత్రం ఏ రూల్స్ లేవు.

అందుకే దీనిని రాచకీయం అన్నారు.

ఇకపోతే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి గెలుపొందాడు.

ఇతను ఇండియా తరపునుండి 2008లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ ద్వార అరంగేట్రం చేశాడు.కాగా 20018 ఐపీఎల్ సీజన్ అతడికి చివరి మ్యాచ్.అయితే మనోజ్ మాత్రం ఇప్పటి వరకు క్రికెట్ కెరీర్‌కు అధికారికంగా గుడ్‌బై చెప్పకపోవడం గమనార్హం.

ఇకపోతే తృణమూల్ కాంగ్రెస్‌లో గత ఫిబ్రవరిలో చేరిన మనోజ్‌, ప్రస్తుతం షిబ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన రథిన్ చక్రబర్తిపై 6వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube