ఐదు రాష్ట్రాల రిజల్ట్స్.. గెలిచిన, ఓడిన నటులు వీళ్లే..?

దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో కచ్చితంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు పోటీ చేస్తూ ఉంటారు.సినిమా రంగంలో అవకాశాలు తగ్గిన తరువాత రాజకీయాల్లోనైనా సత్తా చాటాలని కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తే మరి కొందరు మాత్రం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతారు.

 Election Results 2021 Celebrities Who Contested Assembly Elections, Assambley El-TeluguStop.com

నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు పోటీ చేశారు.

ప్రముఖ నటులలో ఒకరైన సురేష్ గోపీ బీజేపీ పార్టీ తరపున కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.మొదట సురేష్ గోపీ ఆధిక్యం కనబరిచినా ఆ తరువాత మూడో స్థానానికి పరిమితమయ్యారు.

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులైన చాలామంది సెలబ్రిటీలు పోటీ చేశారు.

డీఎంకే పార్టీ తరపున స్టాలిన్ కుమారుడు, ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్ పోటీ చేసి విజయం సాధించారు.

చెపాక్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్ ఏకంగా 60 వేల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం.గతంలో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన ఖుష్బూ బీజేపీ పార్టీ నుంచి థౌజండ్ లైట్స్ డివిజన్ నుంచి పోటీ చేశారు.

ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా ఈమె ఓటమిపాలయ్యారు.

Telugu Assembly, Kamal Hasan, Kushboo, Suresh Gopi-Movie

తమిళనాడులో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.కమల్ హాసన్ గెలుస్తాడని అతని ఫ్యాన్స్ భావించినా ఫలితాలు మాత్రం అతనికి షాక్ ఇచ్చాయి.కమల్ హాసన్ పార్టీ తరపున పోటీ చేసిన వాళ్లు సైతం ఎన్నికల్లో ఓడిపోయారు.

అసెంబ్లీ ఎన్నికలు సినీ ప్రముఖులకు కలిసిరాలేదనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube