ఈవీవీ బ్యానర్ కు గత వైభవం తీసుకొస్తామంటున్న అన్నదమ్ములు !

ఈవీవీ సత్యనారాయణ ఈవీవీ ఎనెర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.అయితే ఈయన దర్శకుడిగా కూడా సూపర్ హిట్ చిత్రాలను తీసాడు.

 Reassurance About Bringing Past Glory To The Evv Entertainments Banner , Evv Ban-TeluguStop.com

ఈయన కొడుకులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లను కూడా హీరోలుగా పరిచయం చేసాడు.కొడుకులతో కూడా సొంత బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించాడు.

అయితే ఈవీవీ సత్యనారాయణ మరణం తర్వాత ఈ బ్యానర్ లో సినిమాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఆర్యన్ రాజేష్ కానీ.

అల్లరి నరేష్ కానీ ఈ బ్యానర్ ను ముందుకు తీసుకు వెళ్లడంలో తడబడడంతో ఈ బ్యానర్ పై సినిమాలు అంతగా రావడం లేదు.ఒకవేళ వచ్చిన ప్లాప్ అవ్వడంతో ఈ బ్యానర్ కొంతకాలంగా కనిపించడం లేదు.

అయితే ఇప్పుడు ఈవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను కొత్తగా ప్రెసెంట్ చేసేందుకు అన్నదమ్ములు ఇద్దరూ రెడీ అయినట్టు సమాచారం.

Telugu Allari Naresh, Aryan Rajesh, Web, Evv, Naandi, Glory-Movie

కొత్త కొత్త ప్రణాళికలతో ఈ బ్యానర్ కు మళ్ళీ గత వైభవం తీసుకు రావడానికి ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ ఇద్దరూ అన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.ఈ నేపథ్యంలోనే ఈ బ్యానర్ పై త్వరలోనే ఒక వెబ్ సిరీస్ తో పాటు రెండు సినిమాలు కూడా తెరకెక్కించ బోతున్నట్టు అందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం అందుతుంది.

ఈ వెబ్ సిరీస్ ను కామెడీ వెబ్ సిరీస్ గా తెరకెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది.

ఇది ఇలా ఉండగా అల్లరి నరేష్ ఈ మధ్యే నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్ళీ తన కెరీర్ ను గాడిలో పెట్టుకున్నాడు.ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

అయితే అన్న ఆర్యన్ రాజేష్ మాత్రం కెరీర్ లో వెనుక పడ్డాడు.ఈ మధ్య వినయ విధేయ రామ సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటించాడు.

మళ్ళీ మరొక సినిమా చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube