వ్యాక్సిన్ డౌట్స్.. మొదటి డోస్ ఒకటి.. రెండో డోస్ మరొకటి తీసుకోవచ్చా..?

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇండియాలో ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే.రోజు రోజుకి కేసులు బాగా పెరుగుతున్నాయి.

 Doubts And Facts Clarification About Covid Vaccine , Corona Vaccine, Covaxin, Co-TeluguStop.com

అయితే కరోనా ప్రభావాన్ని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తాయని తెలుస్తుంది.అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అనుకుంటున్నారు.

అయితే వ్యాక్సిన్ ల పై చాలామందికి ఎన్నో రకాల డౌట్లు ఉన్నాయి.వీటికి నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.

వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా.టీకా మొదటి డోస్ వేసుకుంటే సరిపోతుందా.

రెండో డోస్ కంపల్సరీనా.ఏ వ్యాక్సిన్ సురక్షితం.

మొదటి డోస్ ఒక వ్యాక్సిన్ రెండో డోస్ ఒక వ్యాక్సిన్ రెండో డోస్ మరో వ్యాక్సిన్ తీసుకోవచ్చా ఇవన్ని ప్రజలకు ఉన్న సందేహాలు.

అయితే వీటికి వివరణ ఇస్తూ ప్రస్తుతం ఇండియాలో వేస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జీన్ రెండు వ్యాక్సిన్లు వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటాయని అంటున్నారు.

అయితే టీకా ఎంచుకునే అవకాశం మనకు లేదు.వ్యాక్సిన్ సెంటర్లో వారికి అందుబాటులో ఉన్న టీకాలను వేస్తున్నారు.

ఇక కరోనా నుండి కోలుకున్న వారు టీకా ఎప్పుడు తీసుకోవాలన్నది డౌట్ రేజ్ అవుతుంది.కరోనా నుండి కోలుకున్న వారు మూడు నాలుగు వారాలు ఆగి వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలని అంటున్నారు.

ఇక మొదటి డోస్ ఒక వ్యాక్సిన్.రెండో డోస్ మరో వ్యాక్సిన్ తీసుకోవచ్చా అంటే అలా తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు.

రెండు డోసుల్లోనూ ఒకటే వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతున్నారు.మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే కోలుకున్న తర్వాత రెండు వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలని అంటున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, అలసట, తలనొప్పు, కెఏళ్ల నొప్పులు రావొచ్చని ఇవి రెండు మూడు రోజులు ఉంటాయని చెబుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube