భారత్ కు గుడ్ న్యూస్...ఇండియాకు అమెరికా ఫైజర్ వ్యాక్సిన్..??

అమెరికాను కరోన మహమ్మారి నుంచీ గట్టెక్కించిన ఫైజర్ వ్యాక్సిన్ భారత్ కు రానుందా, ఆదిశగా చర్చలు జరుగుతున్నాయా అంటే అవుననే చెప్పాలి.వ్యాక్సిన్ ముడి సరుకుకు సహకరించండి అని భారత్ అభ్యర్ధన, ఇండో అమెరికన్స్ ఒత్తిడి మేరకు ఒకే చెప్పిన అమెరికా ఇప్పటికే భారత్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది.

 America Pfizer Vaccine To India,america, Covid Cases, India, Pfizer Vaccine, Cov-TeluguStop.com

భారత్ లో పరిస్థితులు మెరుగుపడాలని అన్ని దేశాలు తమకు తోచిన సాయం చేస్తున్నాయి.భారత్ ఇప్పటికే రెండు రకాల వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచగా రష్యా నుంచీ స్పుత్నిక్ వ్యాక్సిన్ ను కూడా దిగుమతి చేసుకుంటోంది.

ఈ క్రమంలోనే

భారత్ అమెరికా ఫైజర్ వ్యాక్సిన్ పై దృష్టి పెట్టింది.ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వడానికి అమెరికా ఒప్పుకుంటే గనుకా భారత్ లో పరిస్థితులు దాదాపు మెరుగు పడుతాయని భావిస్తోంది ప్రభుత్వం.

దాంతో ఫైజర్ వ్యాక్సిన్ కోసం అమెరికాలొని భారత రాయబారికి కీలక సూచనలు చేసింది.ఈ క్రమంలో నిన్నటి రోజున అమెరికాలోని ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ తో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సమావేశమయ్యారు.

Telugu America, Americapfizer, Covid, India, Pfizerceo, Pfizer Vaccine, Taranjit

భారత్ తో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో భారత ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగస్వామ్యమవ్వాలని ఫైజర్ సిఈవో ని కోరారు.ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో సమావేశానికి సంభందించిన విషయాలు వెల్లడించారు.కరోనా కట్టడి చేయడానికి భారత్ కు ఫైజర్ వ్యాక్సిన్ లు పంపాలని కోరానని , భారత్ లో ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టే మార్గాలపై చర్చించినట్టుగా తెలిపారు.ఇదిలాఉంటే ఫైజర్ వ్యాక్సిన్ కంటే ముందుగా అమెరికాలో మెడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఫైజర్ ఎంట్రీ తో సీన్ మొత్తం మారిపోయింది.

అమెరికా ప్రజలు పెద్ద మొత్తంలో ఫైజర్ వ్యాక్సిన్ చేయించుకోవడంతో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.ఇప్పుడు ఈ వ్యాక్సిన్ భారత్ కు ఇవ్వాలని ఫైజర్ సిఈవో ని అడుగుతోంది భారత ప్రభుత్వం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube