పింఛను డబ్బు లక్ష రూపాయలతో పరారైన వాలంటీర్..!

అధికార దుర్వినియోగం పెద్ద స్థాయి వ్యక్తుల్లోనే కాదు చిన్న స్థాయిలో కూడా జరుగుతుంది.డబ్బంటే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి.

 Volunteer Fled With Pension Money One Lakh Rupees,  Pension Money , Volunteer-TeluguStop.com

అలానే ఓ గ్రామ వాలంటీర్ లక్ష రూపాయలు చూడగానే ఇవి లబ్ధి దారులకు ఎందుకివ్వాలి తానే వాడేస్తే పోలా అన్న ఆలోచన వచ్చింది.అంతే సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ లక్ష రూపాయలతో పరారీ అయ్యాడు.

అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలో ఈ సంఘటన జరిగింది.ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామ సచివాలయం కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంకా క్లస్టర్స్ కు చెందిన వాలంటీర్లు శుక్రవారం డబ్బులు అందుకున్నారు.

వారి ఏరియాకు చెందిన లబ్ధిదారులకు ఆ డబ్బును అందిచాల్సిన బాధ్యత వాలంటీర్లకే ఉంది.

ఈ క్రమంలో 43 మంది లబ్ధిదారులకు చెందిన పింఛన్ పనంపించే చేయాల్సిన బైరాపురం వాలెంటీర్ మధుసూధన్ 1,05,500 రూపాయలు తీసుకున్నాడు.

డబ్బులు తీసుకున్నా సరే శనివారం సాయంత్రం వరకు డబ్బులు పంపిణీ చేయలేదని తెలిసింది.లబ్ధిదారులు కూడా ఫిర్యాదు చేయడంతో మధుసూధన్ కి సంబంధిత అధికారులు ఫోన్ చేశారు.

అయితే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులను అడిగితే ఇంటికి రాలేదని చెప్పారట.దీనితో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మధుసూధన్ డబ్బులు తీసుకుని పరారైనట్టు ఈవోఆర్డీ నటరాజ్ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube