వరల్డ్ రికార్డు సాధించిన సూపర్ ఉమెన్.. అసలు ఏం చేసిందంటే..?!

చాలా మంది తీరికలేని జీవితాన్ని గడపాలనుకుంటారు.అందుకోసం వాళ్లు నిర్విరామంగా పనిచేస్తుంటారు.

 Olga Liaschuk, Crushes ,three Watermelon, Viral News, Viral Latest, Social Media-TeluguStop.com

కొందరు తమ చిన్న ప్రపంచంలో ఆనందంగా ఉంటే చాలు అనుకుంటే.మరికొందరు మాత్రం ప్రపంచం మొత్తం తన గురించే మాట్లాడుకోవాలి అని అనుకుంటారు.

అందుకోసం వాళ్లు పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తుంటారు.ఏదో ఒక సరికొత్త రికార్డ్స్ ను నెలకొల్పాలని, గతంలో ఏదైనా వింతగా ఆశ్చర్యంగా చేసిన వారి రికార్డులను బద్దలుకొట్టాలని ఎంతగానో పోరాడుతుంటారు.

వారు కన్న కలలను సాకారం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అలాంటి రికార్డును సాధించడం కోసం ఓ మహిళ సరదా ప్రయత్నం చేసింది.

తొడల మధ్య పుచ్చకాయలను పగలగొట్టి రికార్డు నెలకొల్పింది.ఇది చిన్న విషయం కాదనే చెప్పాలి.

దీని కోసం ఎన్నోసార్లు ఆమె ప్రాక్టీసు చేసింది.చివరికి తాను అనుకున్నది సాధించింది.

ఉక్రెయిన్ దేశానికి చెందిన ఈ మహిళ తన తొడల మధ్య 3 పుచ్చకాయలను వేగంగా నలిపివేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ఓల్గా లియాష్ చుక్ అనేబడే మహిళ తన తొడల మధ్య మూడు పుచ్చకాయలను 14.65 సెకన్లలో పిండి చేసేసింది.దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది.

ప్రపంచంలోని బలమైన మహిళ కావాలన్నది ఓల్గా బలమైన కోరిక.దీని కోసం ఆమె నిరంతరం కష్టపడుతోంది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.ఓల్గా తన తొడలతో పెద్ద పుచ్చకాయలను పిండి చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆమె సాధించిన ఘనతకు పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా ఓల్గా సోషల్ మీడియా ద్వారా పలు విషయాలను షేర్ చేసుకుంది.

తాను చేసిన పని చాలా కష్టమైన పని అని తెలిపింది.సోషల్ మీడియాలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పోస్ట్ చేసిన వీడియోను చూసి కొందరు షాక్ కు గురవుతుంటే మరికొందరు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube