బీజేపీ లోకి ఈటెల ? కేసీఆర్ కు రియాక్షన్ తప్పదా ? 

దాదాపుగా టీఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ ప్రస్థానం ముగిసిపోయినట్టే.పూర్తిగా టిఆర్ఎస్ అధిష్టానం ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేసుకోవడం, ఆయన అవినీతి వ్యవహారాలు బయటకు తీయడం, ఆయన నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖ ను కేసీఆర్ తన ఆధీనంలోకి తీసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి.

 Etela Rajendar Try To Join In Bjp , Bjp, Etela Rajender, Etela Rajender Bjp, Har-TeluguStop.com

ఇక టిఆర్ఎస్ పార్టీకి ఈటెల రాజేందర్ రాజీనామా చేయడం ఒక్కటే మిగిలి ఉంది.అంతర్గతంగా ఎప్పటి నుంచో టిఆర్ఎస్ పెద్దలతో ఈటెల రాజేందర్ కు వ్యవహారం చేడింది.

పరోక్షంగా కేటీఆర్, రాజేందర్ లు సెటర్లు వేసుకున్నారు.ఇక ఆయనకు మంత్రి పదవి దక్కడం అసాధ్యం అనుకున్నారు.

అయినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు మంత్రి పదవిని కేసీఆర్ కట్టబెట్టారు.కానీ రెండు వైపుల నుంచి అసంతృప్తి తీవ్రంగా ఉండడంతో, వీరి మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటూ వస్తున్నాయి.

ఇక ఆయన టిఆర్ఎస్ కు రాజేందర్ దూరమవుతున్న క్రమంలో రాజకీయంగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు ? ఏ పార్టీలో చేరబోతున్నారు అనే హడావుడి అప్పుడే మొదలైంది.తనను అవమానకరంగా టిఆర్ఎస్ నుంచి బయటకు పంపించే ఏర్పాటు, మంత్రి పదవిని తీసివేయడం ఇటువంటి వ్యవహారాలతో రాజేందర్ తీవ్రంగా రగిలిపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ కక్ష తీర్చుకుంటారు అనే సంకేతాలు వినపిస్తున్నాయి.టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా, తెలంగాణలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బిజెపిలో రాజేందర్ చేరబోతున్నారని, ఆ పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఇచ్చేందుకు సైతం బిజెపి అధిష్టానం సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.

Telugu Etela, Etela Step, Etela Rajendar, Hareesh Rao, Telangana, Trs-Telugu Pol

ఎప్పటి నుంచో తెలంగాణలో బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా, మరింత బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ కి ఈటెల వంటి వారు చేరితే మహా ఆనందమే.కేసీఆర్పై పోరాటం చేసేందుకు ఈటెల వంటి వారిని ఉపయోగించుకుంటే మంచిది అనే అభిప్రాయంలో బిజెపి ఉంది.ఇక ఈటెల కూడా బిజెపిలోకి కానీ, మరో పార్టీలోకి వెళ్ళే విషయంలో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదట.మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube