తెలుగులో అవకాశాల కోసం ఆ పని చేసిన గద్దలకొండ హీరోయిన్

టిక్ టాక్ వీడియోలతో ఈ మధ్యకాలంలో చాలా మంది పాపులర్ అయ్యారు.కొంత మంది అందాల భామలు అయితే టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ దర్శకుల దృష్టిలో పడి ఏకంగా హీరోయిన్స్ కూడా అయిపోయారు.

 Mirnalini Ravi Change Manager For Telugu, Gaddalakonda Ganesh, Harish Shankar, T-TeluguStop.com

కొంత మంది భామలు వారి డాన్స్ టాలెంట్ తో టెలివిజన్ షోలలో, వెబ్ సిరీస్ లో సందడి చేస్తున్నారు.ఇలా టిక్ టాక్ ప్రస్తుతం బ్యాన్ అయిపోయిన చాలా మంది దీని ద్వారా సెలబ్రిటీ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.

టిక్ టాక్ స్టార్స్ అంటూ కొంత మందిని తీసుకొచ్చి యుట్యూబ్ చానల్స్ ఇంటర్వ్యూలు చేసి వారిని మరింత ఫేమస్ చేశాయి.ఇదిలా ఉంటే టిక్ టాక్ వీడియోలతోనే గుర్తింపు తెచ్చుకొని హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన అందాల భామ మృణాలిని రవి.

తమిళ్ అమ్మాయి అయిన ఈ భామ తెలుగులో తెరంగేట్రం చేసింది.అధర్వ మురళీకి జోడీగా గద్ధలకొండ గణేష్ సినిమాలో నటించింది.ఈ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు వస్తాయని భావించిన అనుకున్న స్థాయిలో ఛాన్స్ లు రాలేదు.దీంతో మాతృభాషకి వెళ్ళిపోయి అక్కడ ఏకంగా మూడు సినిమాలని లైన్ లో పెట్టింది.

అవి రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.అయితే తెలుగులో అవకాశాలు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్న మృణాలిని రవి తాజాగా తన టాలీవుడ్ లో తన డేట్స్, సినిమాలు చూసేందుకు ఏర్పాటు చేసుకున్న మేనేజర్ ని మార్చేసి మరో సెలబ్రిటీ మేనేజర్ ని నియమించుకుంది.

కాస్తా సర్కిల్ ఉన్న సెలబ్రిటీ మేనేజర్ అయితే అవకాశాలు వేగంగా వస్తాయని భావించి మృణాలిని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.మరి ఇప్పుడైనా ఈ గద్ధలకొండ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube