మరణం కూడా వీరిని విడదీయలేక పోయింది.. మూడుముళ్ల బంధం అంటే ఇదే కావచ్చూ.. !

ఈ లోకంలో ఏ పక్షపాతం చూపకుండా ఏదో ఒకరోజు ప్రతి జీవిని తప్పకుండా పలకరించేది మరణం మాత్రమే.అయితే మరనం అనగానే మనిషికి భయం కలగడం సహజం.

 Inexhaustible Bond In Death Of These Couples From Chilpakuntla Village, Nutanaka-TeluguStop.com

కానీ ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన చివరికి మనిషిని వరించేది మరణం మాత్రమే.

ఇకపోతే జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైనదని చెబుతారు.

అలాంటి పెళ్లిలు నేటికాలంలో అలంకారంగా మారిపోయాయి.కేవలం శారీక సుఖం అనుభవించడానికి ఇచ్చే లైసెన్స్ అనే భావన చాలమందిలో నెలకొంది.

అందుకే ఎక్కువ కాలం నేటికాలం మ్యారేజ్ లు నిలువలేక పోతున్నాయి.

ఇక నిజమైన భార్యభర్తల బంధాన్ని ఆ భగవంతుడు కాదుకదా చివరికి చావు కూడా విడదీయలేదని కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే నూతనకల్ మండలం పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బత్తుల వెంకయ్య(80) ఇటీవల కరోనా వల్ల శుక్రవారం మరణించాడు.

కాగా శనివారం వెంకయ్య మృతదేహానికి శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేస్తున్న సమయంలో ఇతని భార్య బత్తుల సోమమ్మ (73) కూడా మరణించింది.ఈ నేపధ్యంలో యాబై సంవత్సరాలు తోడుగా గడిపిన భార్యాభర్తలు కూడా చావులో తమ బంధాన్ని వీడలేదని గ్రామస్థులు కన్నీరు పెట్టారు.

కాగా మరణించిన భార్యాభర్తలు ఇద్దరికి పక్కపక్కనే దహనం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube