ఎల్.ఈ.డీ టీవీ స్పీకర్లలో అక్రమ బంగారం పట్టివేత..!

చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఎల్.ఈ.

 12 Kgs Gold Seised In Chennai Airport Customs Officers, 12kgs Gold , Chennai Air-TeluguStop.com

డీ టీవీ స్పీకర్లలో 200 గ్రాముల బంగారం పట్టివేత జరిగింది.కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుండి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది.

నాగపట్టణానికి చెందిన బద్రోద్దీన్ అనే వ్యక్తి దుబాయ్ నుండి ఎమిరెట్స్ విమానంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగాడు.అయితే ముందే సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు అతన్ని తనిఖీ చేశారు.

అతను తీసుకొస్తున్న 55 ఇంచుల ఎల్.ఈ.డీ స్పీకర్లలో బంగారు కడ్డీల రూపంలో అక్రమంగా తెచ్చారని గుర్తించారు.అక్రమ బంగారం బయటపడటంతో దాన్ని కస్టమ్స్ వారు స్వాదీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు.

టీవీ స్పీకర్లలో దాదాపు 200 గ్రాముల బంగారాన్ని అమర్చాడు ఆ వ్యక్తి.దీని విలువ మార్కెట్ లో 57.75 లక్షల దాకా ఉంటుందని తెలుస్తుంది.విదేశాల నుండి వచ్చే కొందరు ఇలా బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ కస్టమ్స్ వారికి దొరికిపోతున్నారు.

ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువ అవడం వల్ల కస్టంస్ వారు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేసి మరీ పంపిస్తున్నారు.కొందరు బంగారాన్ని అక్రమంగా షూస్ లో, చెప్పుల్లో, ఎలక్ట్రిక్ వస్తువుల్లో కూడా తరలిస్తున్నారు.

చెన్నై, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లలో వారానికి ఇలాంటి కేసులు ఒకటి రెండు తగులుతున్నాయి.  రకరకాల వస్తువుల్లో అక్రమ బంగారాన్ని తరలించాలని చూస్తున్నారు.అయితే వారికి తగినట్టుగా కస్టమ్స్ వారు అన్నిటిని తనిఖీ చేసి మరీ పంపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube