ఈ టాప్ సినిమాలన్నీ పోసాని లేకుంటే సాధ్యం అయ్యేవి కాదు అని తెలుసా..?

పోసాని కృష్ణ ముర‌ళి.మంచి న‌టుడే కాదు.

 Tollywood Top Movies With The Help Of Posani, Posani-krishna-murali Seetayya Mov-TeluguStop.com

అద్భుత‌మైన రైట‌ర్.సూప‌ర్ డైలాగులు రాస్తాడు.

మంచి క‌థ‌లు అందిస్తాడు.స్క్రీన్ ప్లే మీద గ‌ట్టి ప‌ట్టున్న వ్య‌క్తి.

త‌న వెరైటీ కామెడీ టైమింగ్ తో ప్ర‌స్తుతం చాలా సినిమాల్లో ఏదో ఒక రోల్ చేస్తున్నాడు.అంద‌రినీ ఎంట‌ర్ టైన్ చేస్తున్నాడు.యాక్ట‌ర్ గా, విల‌న్ గా, క‌మెడియ‌న్ గా, సీరియ‌స్ పాత్ర‌ల్లోనూ న‌టించిన పోసాని.200కు పైగా సినిమాల్లో న‌టించారు.

ర‌చ‌యిత‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన పోసాని 100కు పైగా సినిమాల‌కు ప‌నిచేశారు.ఇందులో కొన్ని సినిమాల‌కు క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగుల రైట‌ర్ గా ఉన్నాడు.త‌ను స్టోరీ, డైలాగులు అందించిన ప‌లు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి.వాటిలో కొన్నింటిని ఇప్ప‌డు ఇప్పుడు చూద్దాం.

సీత‌య్య‌

హరి కృష్ణ హీరోగా న‌టించిన సీత‌య్య సినిమాకు పోసాని స్టోరీతో పాటు డైలాగులు అందించాడు.

ప్రేయ‌సి రావే

శ్రీ‌కాంత్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు సైతం పోసాని ప‌నిచేశాడు.క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగులు త‌నే చూశాడు.

అల్లుడా మ‌జాక‌

చిరంజీవి న‌టించిన ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగులు పోసాని అందించాడు.

ప‌విత్రబంధం

Telugu Gokulamlo Seeta, Manoharam, Duryodhana, Pavitra Bandham, Posani, Posanikr

వెంక‌టేష్ హీరోగా చేసిని ఈ సినిమాకు పోసాని డైలాగులు రాశాడు.

ప్రేమించుకుందాం రా

వెంక‌టేష్ హీరోగా చేసిన మ‌రో సినిమా ప్రేమించుకుందాం రా మూవీలోనూ పోసాని డైలాగులు రాశాడు.

గోకులంలో సీత‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన గోకులంలో సీత సినిమాకు పోసాని డైలాగులు అందించాడు.

మ‌నోహ‌రం

Telugu Gokulamlo Seeta, Manoharam, Duryodhana, Pavitra Bandham, Posani, Posanikr

జ‌గ‌ప‌తి బాబు హీరోగా చేసిన ఈ సినిమాకు పోసాని డైలాగులు రాశాడు.

ఆహా

జ‌గ‌ప‌తి బాబు మ‌రోసిమా ఆహాకు సైతం ఆయ‌న డైలాగ్ రైట‌ర్ గా ప‌నిచేశారు.
వెంక‌టేష్ మూవీ జెమినీలోనూ పోసాని డైలాగులు రాశారు.

ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌

శ్రీ‌కాంత్ హీరోగా చేసిన ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లేతో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube