తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రెండు రకాలుగా ఉంది.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్.. ?

ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని ఊహించుకున్న యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఇంకా అర్ధం కావడం లేనట్లుగా ఉంది తెలంగాణ సంపద అంతా దోపిడికి గురవుతుందని, మూడువేలకు ఓటు అమ్ముకుంటూ బానిస బ్రతులకు అలవాటుపడిన ఈ ప్రజల్లో మార్పు అనేది అసాధ్యం అని ఇప్పటికే తెలంగాణ రాజకీయాలతో విసిగిపోయిన వారు అనుకుంటున్నారట.

 There Are Two Types-of Corruption Telangana, Bjp Mp, Bundy Sanjay, Shocking Comm-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో ఈటల మ్యాటర్ హాట్ కాఫీలా మారింది.

ఈ అంశం పై పలువురు నేతలు షాకింగ్ కామెంట్స్ చేస్తుండగా దూకుడు బండిగా పేరు తెచ్చుకున్న బండి సంజయ్ ఊరుకుంటాడా అందుకే స్పందించి తెలంగాణ ప్రభుత్వం పై మాటల తూటాలను వదిలాడు.

Telugu Bjp Mp, Bundy Sanjay, Telangana-Latest News - Telugu

ప్రభుత్వం ఒక మంత్రిపై చర్యలు తీసుకుంటే మొత్తం నీతివంతం అయిపోదని కబ్జాలు, అవినీతికి పాల్పడుతున్న మిగతా మంత్రులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.కాగా ముఖ్యమంత్రి పొలిటికల్ హడావుడి సృష్టిస్తు, కరోనా నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

ఇకపోతే రాష్ట్రంలో అవినీతి రెండు రకాలుగా ఉందని, ఒకటి అనుకూల, రెండు వ్యతిరేక అవినీతి ఉందన్నారు.

అదీగాక మొత్తం 77 మంది టీఆర్ఎస్ నేతలపై కబ్జా ఆరోపణలు ఉన్నాయని మరి వీరందరి పై చర్యలు తీసుకున్నప్పుడే మీ నిజాయితీ ప్రజలకు తెలుస్తుందని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube