మహారాష్ట్రలో ఆ పరిస్థితి రాకూడదు..!

దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా తీవ్రత తగ్గించేందుకు అక్కడ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.కొన్ని ఏరియాల్లో లాక్ డౌన్, మరికొన్ని ఏరియాల్లో కఠిన నిబంధనలు అమలు చేయడం వల్లే ప్రస్తుతం మహారాష్ట్రలో కేసులు తగ్గాయని అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.

 Uddhav Thackeray About Maharashtra Full Lockdown, Uddhav Thackeray, Maharashtra-TeluguStop.com

అలా చేయకపోతే ఈ పాటికి మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 9 నుండి 10 లక్షల దాకా చేరుకునేవని అన్నారు.మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన సిఎం ఉద్ధవ్ ఠాక్రే కఠిన నిబంధనలతోనే కేసుల సంఖ్య కట్టడి చేశామని అన్నారు.

పూర్తి లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని.ఆ పరిస్థితి రాకూడదని తాను కూడా భావిస్తున్నానని అన్నారు.ప్రస్తుతం మహారాష్ట్రలో 6.5 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలుస్తుంది.అయితే అందరం కలిసికట్టుగా మునుపటిలానే మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకుందామని.కరోనాని కట్టడి చేద్దామని అన్నారు.18 నుండి 44 ఏళ్ల వయసు వారికి కావాల్సిన 12 కోట్ల వ్యాక్సిన్ డోస్ లకు వన్ టైం పేమెంట్ చెక్ ఇస్తామని అన్నారు.రాష్ట్రానికి శుక్రవారం 3 లక్షల డోస్ వ్యాక్సిన్ వచ్చిందని తెలిపారు సిఎం ఉద్ధవ్ ఠాక్రే.

 ఓ పక్క కేసులు పెరుగుతున్నా కరోనాని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంగం చేయాలని నిపుణులు చెబుతున్నారు.అయితే కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube