నేటి నుండి మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.వారం రోజుల ముంగిట రోజుకు ఐదు లక్షల కొత్త కేసులు బయటపడే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉన్నట్లు దేశం క్లిష్ట పరిస్థితుల్లో కి వెళ్లనున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 The Third Phase Of Vaccination Starts From Today Corona Second Wave, Corona Vacc-TeluguStop.com

దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చేయడం కోసం చేతులెత్తేసిన పరిస్థితి కి పరిణామాలు దారితీస్తున్నాయి.కరోనా బారిన పడిన రోగులు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇటువంటి తరుణంలో నేటి నుండి మూడవ దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఇదిలా ఉంటే మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం స్టార్ట్ అయిన గాని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టీకాలు లేవని అప్పుడే చేతులెత్తేశాయి.వైరస్ భయంకరంగా విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ కొరతతో పాటు ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తుంది.

దేశంలో ఈ పరిస్థితికి రావడానికి ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తూ ఉంది.దీనితో మూడో దశ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ప్రకటించిన గాని చాలా రాష్ట్రాలలో టీకా లు లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మా ప్రాణాలను ప్రభుత్వాలే తీస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube