రంజాన్ విశిష్టత.. ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా?

రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ముఖ్యమైన పండుగ.చంద్రమాన కాలమానం ప్రకారం ఇస్లామిక్ క్యాలెండర్ లో 9వ నెలను రంజాన్ మాసం అని పిలుస్తారు.

 Eid-mubarak 2020 Timing Date And Importance Of Ramadan Festival In Telugu Edi Mu-TeluguStop.com

ఈ నెలలోనే ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్ ఆవిష్కరించబడినదని ముస్లింలు విశ్వసిస్తారు.ముస్లింలు ప్రతిరోజు నిర్వహించే నమాజ్ నుంచి ప్రతిరోజు అవలంబించే పద్ధతుల వరకు ఎన్నో విషయాలు ఇస్లాం నుంచి ఆదర్శంగా తీసుకున్నాయి.

ఈ రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరులు 5 ప్రాథమిక విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలి.

ఇమాన్, నమాజ్, జకాత్, రోజా, హజ్ అనే 5 విధులను విధిగా పాటించాలి.

ఇమాన్: ఉపవాస సమయంలో భగవంతుడైన అల్లాహ్ పై ఎంతో నమ్మకం ఉండాలి.నమాజ్: 8 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్క ముస్లిం రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి.జకాత్: తమ స్థోమతను బట్టి దానధర్మాలు చేయాలి.రోజా: ఉపవాసం దీక్ష చేయడం.ఉపవాసదీక్షను ఉర్దూ భాషలో ‘రోజా’ అనీ పిలుస్తారు. ఇస్లాంలో ‘రోజా’ అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారపానీయాలు సేవించకుండా మనోవాంఛలకు దూరంగా ఉండటం.హజ్: ప్రతి ముస్లిం తమ జీవితంలో ఒక్కసారైనా మక్కాలోని దైవగృహం కాబాను దర్శించాలి.

ఉపవాస దీక్ష ఎందుకు చేస్తారంటే.

Telugu Edi Mubarak, Ramadan, Ramjan Festival-Telugu Bhakthi

రంజాన్ నెలలో ముస్లిం పవిత్ర గ్రంధమైన ఖురాన్ అవతరించిన నెలగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నెలంతా ఉపవాస వ్రతాలతో గడుపుతారు.రుజు మార్గం చూపి, సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి కాబట్టి ఆ మాసం అంతా విధిగా ఉపవాస దీక్ష పాటించాలి’.రంజాన్ మాసంలో జకాత్ – సద్కాలు ఎక్కువగా జరుగుతాయి.సహనానికి ప్రతీక రంజాన్ మాసం.దీనికి ప్రతిఫలం స్వర్గం. ఈ ఉపవాసం చేసేటప్పుడు తమ మనస్సు ఎంతో నిగ్రహంగా ఉంచుకోవడం, ఆగ్రహాలకు లోనుకాకుండా ఎంతో శాంతియుతంగా ప్రవర్తిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube