సాయిధరమ్ తేజ్ పేరుతో ఓ గ్యాంగ్ బడా ప్లాన్.. కాని చివరికి?

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.అయితే కొత్తగా సాంకేతికత అందుబాటులోకి వచ్చిందంటే దానిని చక్కగా వినియోగించుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి.

 Fraudsters Cheating In The Name Of Hero Sai Dharam Tej, Mega Hero Sai Dharam Tej-TeluguStop.com

దానిని చెడుకు వినియోగిస్తే సాంకేతికతను సరైన రీతిలో వినియోగించుకోలేక పోతాం.అయితే ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది.

రకరకాల మార్గాలుగా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు.అయితే ఇటువంటి ప్రయత్నాలు సెలబ్రెటీల పేరుతో కూడా జనాలను బోల్తా కొట్టించడం ప్రారంభించారు.

తాజాగా సాయిధరమ్ తేజ్ పేరుతో ఓ వ్యక్తి నాకు అర్జెంట్ గా డబ్బులు అవసరం ఉందని చెప్పి 15,000 రూ.అడిగాడు.అయితే ఆ సదరు వ్యక్తి వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ దృష్టికి తీసుకొచ్చారు.వెంటనే స్పందించిన సాయి ధరమ్ తేజ్ నా పేరుతో కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారని, అటువంటి కాల్స్ వచ్చినా, మెస్సేజ్ వచ్చినా స్పందించవద్దని, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సాయి ధరమ్ తేజ్ విజ్ఞప్తి చేసాడు.

అయితే ఇంకా ఈరోజుల్లో ఇలాంటి వాటిని నమ్మి డబ్బు ఎలా పంపిస్తారో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.సినిమా తారలకు డబ్బు కొరత ఎందుకు ఉంటుందని, మరీ 15,000 రూపాయల కోసం ఎందుకు ఇబ్బంది పడుతారనే ఆలోచన డబ్బు పంపేవారికైనా ఉండకపోతే ఎలా అని నెటిజన్లు చురకలంటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube