అన్ని సరి చూసుకున్నాకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారా ?

తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ అయిన అంశం మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాల వ్యవహార అంశం.మూసాయిపేట, అచ్చంపేటకు చెందిన కొంత మంది రైతులు కేసీఆర్ కు తమ భూములను ఈటెల రాజేందర్ కబ్జా చేసాడని, దయచేసి మా భూములు మాకు ఇప్పించాలని కేసీఆర్ కు లేఖ రాశారు.

 Telangana Cm Kcr Orders Inguiry Into Land Grabbing Issue, Land Grabbing Allegati-TeluguStop.com

అయితే ఈ రైతుల లేఖకు స్పందించిన కేసీఆర్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు.తమ సొంత మీడియాలో కూడా ఈటెలపై చాలా ఘాటుగా వ్యాఖ్యానిస్తూ కథనాలను ప్రసారం చేసింది.

అయితే ఈటెల రాజేందర్ ను టచ్ చేయడమంటే మామూలు విషయం కాదు.

కరీంనగర్ జిల్లాలో గత 20 సంవత్సరాలుగా రకరకాల పదవులు అధిరోహించి జిల్లా రాజకీయాలలో కీలక పాత్రను పోషించిన వ్యక్తి ఈటెల రాజేందర్.

అయితే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఇంటిలిజెన్స్ తో ఆరా తీసినట్టు తెలుస్తోంది.ఈటెల పై ఇలాంటి నిర్ణయం తీసుకుంటే జిల్లాలో పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఏఏ నాయకులు పార్టీని వీడే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇంటిలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈటెల వ్యవహారంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పెద్దగా పార్టీకి నష్టం ఏమీ ఉండదని, హుజురాబాద్ లో కొంత నష్టం జరుగుతుందని కొంత క్లారిటీ రావడంతో ఈటెల పై విచారణకు ఆదేశించారని తెలుస్తోంది.మరి ఈ భూ వ్యవహారం వివాదం ఎంతవరకు వెళ్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube