పుర ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా కోదండరాం...పార్టీ దారి ఎటు వైపు?

తెలంగాణ జనసమితి పార్టీ అధినేత కోదండరాం తెలియని అసలు సిసలైన తెలంగాణ వాది ఉండరనే చెప్పవచ్చు.తెలంగాణ పోరాట చరిత్రలో కోదండరాంకు ప్రత్యేక స్థానం ఉంది.

 Let's Stay Away From Contesting In Pura Elections Too ... Which Way Is The Party-TeluguStop.com

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసి ఆ జేఏసీకి కన్వీనర్ గా ఉండి అన్ని రకాల వర్గాలను ఏకం చేసి తెలంగాణను సాధించడంలో కీలక పాత్రను పోషించారు.అయితే ఆ తరువాత కేసీఆర్ తో విభేదించి తెలంగాణ జనసమితి పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా పార్టీని ఏర్పాటు చేసినా పార్టీని ప్రస్తుత కులం, మతం, ప్రాంతం ఆధారంగా నడిచే ధనిక రాజకీయాలలో కోదండ రామ్ ఇమడలేకపోయాడు.సత్తా చాట లేకపోయాడు.

దానికి నిదర్శనమే పట్టభద్రుల ఎన్నికల్లో వ్యక్తిగతంగా కోదండరాం ఓటమి, ఇక ఏ ఎన్నికలలో పోటీ చేద్దామని ప్రయత్నించినా సరైన అభ్యర్థి లేకపోవడంతో పోటీకి ఆసక్తి చూపలేదు.అయితే ఇప్పుడు తెలంగాణ జనసమితి పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, వ్యక్తిగతంగా కోదండరాం ఎటువంటి వ్యూహంతో భవిష్యత్తులో ముందుకు వెళ్లాలనుకుంటున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

మరి ఇప్పటికీ కోదండరామ్ తన పార్టీ వ్యూహ రచనపై స్పందించకపోయినా ఎవరికి వారు పార్టీ పరిస్థితి తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube