ట్రైలర్‌ రివ్యూః ఇంట్రెస్ట్‌ గా ఉన్న నెట్‌ఫ్లిక్స్ 'సినిమా బండి'

ఇండియన్‌ మార్కెట్‌ ను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ వారు వరుసగా పెద్ద హిందీ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.ఇదే సమయంలో తెలుగు లో కూడా సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.

 Telugu Film Cinema Bandi Official Trailer Review Netflixindia , Cinema Bandi , T-TeluguStop.com

మొత్తానికి నెట్‌ ఫ్లిక్స్ లో వచ్చే కంటెంట్‌ విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని అందరిలో నమ్మకం ఉంది.తాజాగా నెట్‌ఫ్లిక్స్ లో సినిమా బండి అనే కొత్త వెబ్‌ సిరీస్‌ రాబోతుంది.

మే 14న ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది.ఇది పూర్తిగా కొత్త కథతో రూపొందించినట్లుగా ట్రైలర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది.

ట్రైలర్‌ చాలా సహజంగా ఆకట్టుకునే విధంగా ఉంది.ఈ వెబ్‌ సిరీస్ ను ప్రముఖ బాలీవుడ్‌ దర్శకద్వయం రాజ్ అండ్‌ డీకే లు నిర్మించడంతో అంచనాలు మరింతగా ఉన్నాయి.

అంతా కొత్త వారే అయినా కూడా చాలా ఇంట్రెస్ట్‌ మాత్రం కలుగుతోంది.

సినిమా బండి వెబ్‌ సిరీస్‌ ట్రైలర్ లోనే మొత్తం కథ చెప్పేశారు.

చాలా ఫన్నీగా ఆకట్టుకునే విధంగా ఈ కథనం సాగబోతుంది.అందుకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయని అనిపిస్తుంది.

ఒక సాదారణ ఆటో డ్రైవర్ కు తన ఆటోలో ప్రయాణించిన వ్యక్తి కెమెరా మర్చిపోవడంతో దొరుకుతుంది.దాన్ని మొదట ఏంటో తెలియకుండానే ఇంట్లోకి తీసుకు వెళ్తాడు.

ఆ తర్వాత అది పెద్ద కెమెరా అని, అందులో సినిమాలు తీయవచ్చు అని మరో వ్యక్తి చెబితే తెలుస్తుంది.మన వద్ద కెమెరా ఉంది కనుక మనమే ఒక సినిమా తీద్దామా అంటాడు.

అలా సినిమా తీయడం మొదలు పెట్టారు.సినిమా మొదలు పెట్టిన తర్వాత చాలా చిత్ర విచిత్రమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటారు.

మరో వైపు కెమెరా పోగొట్టుకున్న వెదుకుతూ ఉంటారు.అలా మొత్తం ఈ వెబ్‌ సిరీస్ సాగుతుందని ట్రైలర్‌ ను బట్టి అర్థం అవుతుంది.

ట్రైలర్‌ చూస్తుంటే ఇది చాలా ఇంట్రెస్ట్‌ గా సాగుతుందని అనిపిస్తుంది.మే 14న రాబోతున్న ఈ వెబ్‌ సిరీస్ తప్పకుండా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube