సెంచరీ కొట్టిన బిడెన్...అమెరికా ఆర్ధిక వృద్దికి కీలక నిర్ణయం...చైనాకు చుక్కలే...!!

అమెరికా అధ్యక్షుడు బిడెన్ సెంచరీ కొట్టారు.అధ్యక్షుడిగా ఎన్నికయ్యి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బిడెన్ అమెరికన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు.

 Us Presidnet Joe Biden 100days Progress Report, Covid, Americans, Jobs, China Pr-TeluguStop.com

మొదటి సారిగా అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన పలు ఆసక్తి కరమైన విషయాలను ప్రస్తావించారు.అమెరికాలో కరోనా ను విజయవంతగా తరిమికోట్టాం.

కరోనా విషయంలో ఇకపై అమెరికన్స్ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.గతంలో అమెరికాలో కరోనా అంటేనే వణికిపోయిన దేశాలకు ఇప్పుడు మనం ఆదర్శంగా నిలిచామని అన్నారు.

ఈ మాటలు నేను చెప్పడానికి గర్వంగా భావిస్తున్నానని ప్రకటించారు.

కరోనా పై మనం విజయం సాధించాం అలాగే ఇక మనం దృష్టి పెట్టాల్సింది మన దేశ ఆర్ధిక పరిస్థితిపై అందుకు మనం చేయాల్సింది కేవలం మన దేశ ఉత్పత్తులను మనం కొనడమే.

విదేశీ వస్తువులను కొనకుండా మన దేశ ఉత్పత్తులు కొనడం వలన మనం ఆర్ధికంగా బలపడుతామని అన్నారు.అంటే పరోక్షంగా చైనా ఉత్పత్తులను కొనవద్దనే సూచనలు బిడెన్ అందించారు.

దాంతో చైనా కు అమెరికా నుంచీ వచ్చే మెజారిటీ ఆదాయానికి గండి పడినట్లే నని అంటున్నారు నిపుణులు.అమెరికాలో కొత్త పెట్టుబడుల ద్వారా వచ్చే ఉద్యోగాలు ఇక అమెరికన్స్ కు చెందుతాయని ప్రకటించారు.

అమెరికా జాబ్ ప్లాన్ ను ఎప్పటి నుంచో అనుసరిస్తుందని ఏ ప్రభుత్వమైనా అమెరికా జాబ్ ప్లాన్ అనుసరించి తీరాలని ఈ క్రమంలోనే కొత్త పెట్టుబడుల ద్వారా వచ్చే ఉద్యోగాలు అమెరికన్స్ కు చెందుతాయని, ఇది వ్యాపార నిభందనలకు విరుద్దం కాదని తెలిపారు.మనం గతాన్ని వీడాలి, పూర్వ వైభవం అమెరికా సాధించాలంటే ఆర్ధిక ఎదుగుదల మనకు ఎంతో అవసరమని, ప్రపంచానికి మళ్ళీ నాయకత్వం వహించాలంటే మనం తప్పకుండా స్వదేశీ వస్తువులనే కొనాలని పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube