టాలీవుడ్ కి ఇంకో నెల రోజులు ఇవే కష్టాలట!

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంత దారుణమైన స్థితిలో అందరికీ తెలిసిందే.ఈ వైరస్ ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉండగా.

 The Month Of May Should Be Lock Down To Tollywood , May Month, Lock Down, Tollyw-TeluguStop.com

ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్న క్రమంలో దేశం ఏమి చేయలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

ఇప్పటికే పలు రంగాలు మూతపడగా.సినీ పరిశ్రమ కూడా మూత పడిన సంగతి తెలిసిందే.

ఇప్పటికీ పలు సినీ పరిశ్రమలో చాలామంది నటీనటులకు, దర్శకనిర్మాతలకు, సిని బృందాలకు వైరస్ వ్యాప్తి చెందగా.సినిమా షూటింగ్ లతో సహా.సినిమా విడుదల కూడా వాయిదా పడ్డాయి.అంతేకాకుండా థియేటర్లు కూడా మూతబడ్డాయి.

గత ఏడాదే ఫస్ట్ వేవ్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సినీరంగం.మళ్లీ అదే కోవలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

దాదాపు పదిహేను సినిమాలు విడుదలకు వాయిదా పడగా, షూటింగ్ సమయంలో ఉన్న దాదాపు 25 సినిమాలు వాయిదా పడ్డాయి.

Telugu Corona Wave, Covideffect, Covid, Lock, Problems, Theaters, Tollywood-Movi

ఇప్పటికే సినిమా షూటింగ్ లో చివరి దశలో ఉండగా సరైన సమయంలో సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అంతే కాకుండా పెద్ద పెద్ద సినిమాలకు భారీ బడ్జెట్ తో సెట్ లకు ఖర్చుపెట్టగా.కొంతవరకు అవి నష్టమే జరుగుంటాయి.

ఇక కొన్ని సినిమాలు పలు జాగ్రత్తలతో సినిమా షూటింగులు చేయాలనుకోగా.అందులో ఎవరో ఒకరు కీలక పాత్రస్తులు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భయంతో షూటింగ్ లో పాల్గొనడం లేదు.

ఇక ఏమి చెయ్యలేక నటీనటులందరూ తమ ఇళ్లల్లో ఉండిపోయారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు.ఇక ప్రతి సినీ బృందాలు సినిమాలకు బ్రేక్ ఇస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు.తిరిగి మళ్లీ కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేంతవరకు షూటింగులు జరగకూడదని ఫిక్స్ అయ్యారు.

కాబట్టి మరో నెల మొత్తం సిని ఇండస్ట్రీ ఇలాగే ఉంటుందని తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube