ఆర్ఆర్ఆర్ అక్టోబర్ లో రావడం పక్కా... చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ తో పాటు బాలీవుడ్ నుంచి అలియా భట్ సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Rrr Movie Release Date Don't Have Chance To Change, Tollywood, Jr Ntr, Ram Chara-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.ఇక రామ్ చరణ్, తారక్ ఈ సినిమాలో చేసిన అల్లూరి, కొమరాంభీమ్ పాత్రలకి సంబందించిన టీజర్స్ కూడా వచ్చి ప్రేక్షకుల ఆకట్టుకోవడంతో పాటు రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి.

భారీ కాన్వాస్ పై రాజమౌళి ఈ సినిమాని ఆవిష్కరిస్తున్నారు.బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది.ఈ నేపధ్యంలో పెద్ద సినిమా షూటింగ్ అన్ని కూడా వాయిదా పడిపోయాయి.ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా వాయిదా పడింది.ఇప్పటికే ఈ సినిమాని అక్టోబర్ 13న రిలీజ్ డేట్ గా చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే కరోనా సిచువేషన్ కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.అయితే సినిమా ఎట్టి పరిస్థితిలో వాయిదా పడే అవకాశం లేదని, అనుకున్న టైమ్ కి కచ్చితంగా రిలీజ్ అవుతుందని చిత్ర నిర్మాతనుంచి క్లారిటీ వచ్చింది.

ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ కావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్న నేపధ్యంలో అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావడం పక్కా అని చిత్ర యూనిట్ నుంచి కూడా వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube