ఆ మాటలు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయన్న డేల్ స్టెయిన్..!

ఐపీఎల్ 2021 సీజన్‌ లో ప్రత్యర్థులకి చెమటలు పట్టించడాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అలవాటుగా చేసుకుంది.ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ నాల్గింటిలో గెలుపొందడం ద్వారా టాప్-4 లో కొనసాగుతోంది.

 Former South African Pacer Dale Steyn, Shivam Mavi,kkr Bowler, Ipl 2021, Dale St-TeluguStop.com

మరోవైపు వరుసగా నాలుగు పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు రుచి చూసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టోర్నీలో అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.ఈ రెండు జట్లు అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకి ఢీ కొనబోతున్నాయి.బౌలింగ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ గత మ్యాచ్‌ లో పుంజుకుంది.

సీజన్‌ లో తొలిసారి సమష్టిగా రాణించిన ఆ జట్టు బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు కూడా పడగొట్టారు.మరీ ముఖ్యంగా శివమ్ మావి రూపంలో పాట్ కమిన్స్‌ కి సరైన జోడి దొరికింది.

ఇక ప్రసీద్ పరుగులిస్తున్నా వికెట్లు పడగొడుతున్నాడు.ఈ తరుణంలో నిన్న కోల్‌కతా నైట్ రైడర్ శివం మావి మాటలకు భావోద్వేగానికి గురైన దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ కంటతడి పెట్టుకున్నాడు.

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్ఫో నిర్వహిస్తున్న టీ20 టైమ్‌ ఔట్‌ అనే కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రాతో పాటు డేల్‌ స్టెయిన్‌ పాల్గొన్నాడు.ఈ సందర్భంగా, శివం మావి మాట్లాడుతూ.‘‘నేను క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి డేల్‌ స్టెయిన్‌ ఆటను ఎంతో శ్రద్ధగా గమనిస్తున్నా.బౌలింగ్‌ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయనను అనుసరిస్తున్నా. డేల్‌ స్టెయిన్‌ లాగే అవుట్‌ స్వింగర్లు వేయడం ప్రాక్టీసు చేసేవాడిని.అతడితో పాటు బుమ్రా, భువనేశ్వర్‌ బౌలింగ్‌ను కూడా ఫాలో అయ్యేవాడిని.

అయితే, నా రోల్‌ మోడల్‌ మాత్రం డేల్‌ స్టెయిన్‌’’ అని చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో ఉద్వేగానికి లోనైన డేల్‌ స్టెయిన్‌.

శివం మాటలు విని తన కళ్లు చెమర్చాయని, తన ప్రభావం శివంపై ఇంతలా ఉంటుందని ఊహించలేదని పేర్కొన్నాడు.‘‘నిజంగా అద్భుతం.

నిజం చెప్పాలంటే.తన మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

నాకు క్రికెట్‌ ఆడటం అంటే ఇష్టం.అందుకే ఇప్పటికీ ఆటను కొనసాగిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక మావి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడన్న స్టెయిన్‌, ఇలాగే ఆడితే త్వరలోనే టీమిండియాకు ఆడతాడని, తన కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు.కాగా ఐపీఎల్‌ – 2021లో కేకేఆర్‌ కు ప్రాతినిథ్యం వహిస్తున్న 22 ఏళ్ల శివం మావి, సోమవారం పంజాబ్‌ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.

ఇక ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube