సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న జూనియర్ ఎన్టీఆర్ చిన్ననాటి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్..!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎంతటి టాలెంటెడ్‌ నటుడో అంతే మంచి డ్యాన్సర్‌ కూడా.హీరోగా, డ్యాన్సర్‌గా పరిశ్రమలో తనకంటూ తారక్‌ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Junior Ntr Childhood Classical Dance Video Goes Viral In Social Media , Jr Ntr,-TeluguStop.com

వెస్టర్న్‌ తో పాటు ఆయన క్లాసీకల్‌ డ్యాన్స్‌ కూడా నేర్చుకున్న సంగతి తెలిసిందే.బాలరామాయణం సినిమాతో పరిశ్రమలో అడుగు పెట్టిన తారక్‌ అంతకు ముందు క్లాసికల్‌ డ్యాన్సర్‌గా పలు స్టేజ్‌ షోలు ఇచ్చాడు.

అయితే ఆ వీడియోలను చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.తాజాగా తారక్‌ భరత నాట్యంకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

టీనేజ్‌ లో ఉండగా ఎన్టీఆర్‌ స్టేజ్‌ పై నాట్యం చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.అది చూసి ఆయన అభిమానులు తెగ మురిసిపోతూ పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం లో షేర్‌ చేస్తున్నారు.

కాగా ఎన్టీఆర్‌కు చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌ అంటే అమితమైన ఆసక్తి ఉండేదట.అది తెలిసి ఆయన తల్లి షాలిని నృత్యకళలో శిక్షణ ఇప్పించారట.

డ్యాన్స్‌ నేర్చుకుంటున్న సమయంలోనే ఎన్టీఆర్‌ స్టేజ్‌పై నృత్యకళ ప్రదర్శనలు ఇస్తూ ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నాడట.ప్రస్తుతం ఎన్టీఆర్‌ దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ షూటింగ్‌ తో బిజీగా ఉన్నాడు.

ఇందులో ఎన్టీఆర్‌ కోమరం భీంగా కనిపించనున్న సంగతి తెలిసిందే.కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్.

విజయ్ తో కలిసి ఎన్టిఆర్ మరో భారీ మల్టీస్టారర్ ను చేయనున్నాడు.ఇక ఈ సినిమా కు అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నట్లు తెలపగా.అది ఈ సినిమానేనని అభిమానులు ఫిక్స్ అయ్యారు.

అంతేకాకుండా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా రూపొందనుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube