ఆ సమయంలో ఆది ఆదుకున్నారు.. దొరబాబు భార్య ఎమోషనల్..?

జబర్దస్త్ షో ద్వారా తక్కువ సమయంలోనే కమెడియన్ గా హైపర్ ఆది ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.అయితే హైపర్ ఆది స్కిట్లు చేసే సమయంలో ఎక్కువగా దొరబాబు, పరదేశీ పేర్లతో కామెడీని పండిస్తారు.

 Comedian Dorababu Wife Amulya Emotional In Sridevi  Drama Company  Show , Amulya-TeluguStop.com

దొరబాబు, పరదేశీలను గతంలో ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే హైపర్ ఆది దొరబాబు, పరదేశీలపై నెగిటివిటీ పెరిగేలా స్కిట్లు చేయడంపై కొన్నిసార్లు ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

కొందరు జబర్దస్త్ కమెడియన్లు సైతం హైపర్ ఆది దొరబాబు అరెస్ట్ కావడం గురించి స్కిట్లు చేయడంపై నెగిటివ్ కామెంట్లు చేశారు.అయితే దొరబాబు భార్య అమూల్య దొరబాబు అరెస్ట్ అయిన సమయంలో ఆది చేసిన సహాయం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుధీర్ అమ్యూలతో ఏరికోరి మా దొరబాబునే చేసుకోవడానికి కారణం ఏంటి.? అని అడగగా మా ఇంట్లో వాళ్లు దొరలాంటి వాడిని పెళ్లి చేసుకోమన్నారని అందుకే ఈ దొరను పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పారు.

Telugu Amulya, Dorababu, Hyper Aadi, Hyperaadi, Jabardast Show, Paradesi, Sridev

హైపర్ ఆది వెంటనే టిక్ టాక్ లో అంతమంది ఫాలోవర్లు ఎందుకొచ్చారో ఇప్పుడర్థమైందని పంచ్ వేస్తారు.జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా దొరబాబును మాత్రం వదులుకునేది లేదని అమూల్య అన్నారు.గతంలో దొరబాబు కేసులో అరెస్ట్ అయిన సమయంలో ఆది అన్న 5నిమిషాలకు ఒకసారి కాల్ చేసి ఫుల్ సపోర్ట్ ఇచ్చారని ఇప్పటికీ తన ఫోన్ లో, దొరబాబు ఫోన్ లో ఆది ఫోన్ నంబర్ గాడ్ అని ఉంటుందని అమూల్య తెలిపారు.

ఆది దొరబాబు గురించి మాట్లాడుతూ దొరబాబు చాలా మంచి వ్యక్తి అని తాను టీమ్ లీడర్ అయిన కొత్తలో దొరబాబు పరిచయం అయ్యాడని దొరబాబుకు ఎవరినీ మోసం చేయాలనే ఆలోచన అస్సలు ఉండదని ఆది అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube