తెలంగాణలో ఎల్ఆర్ఎస్ చిచ్చు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. !

తెలంగాణ ప్రభుత్వం తీరు పై తరచుగా కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ఇలా చెప్పుకుంటూ వెళ్లితే ఒక్క అంశం అని లేదు.

 High Court Issues Key Directions To Telangana Government On Lrs, Telangana Govt,-TeluguStop.com

తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన విధానంలో గానీ, కరోనా సమయంలో తీసుకుంటున్న చర్యల విషయంలో గానీ, ఎల్ఆర్ఎస్ విషయంలో గానీ తరచుగా మొట్టకాయలు వేస్తూనే ఉంది ఉన్నత న్యాయస్దానం.

ఇప్పటికే ఎల్ఆర్ఎస్ పై ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో, పేదల భూముల పాలిట శాపంగా మారిన ఎల్ఆర్ఎస్ ను ఆపేయాలని ప్రతిపక్షాలు కూడా పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఎల్ఆర్ఎస్ అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అనధికార లే అవుట్లు, భవనాల క్రమ బద్దీకరణపై దాఖలైన పిటిషన్లపై స్పందించిన ధర్మాసనం సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున విచారణ జరపలేమని పేర్కొంటూ, సుప్రీంకోర్టు తన నిర్ణయం వెల్లడించే వరకు ఎల్ఆర్ఎస్ పై బలవంతపు చర్యలు ఆపాలని ఆదేశించింది.

సుప్రీం కోర్టులో కేసు తేలేవరకు బీఆర్ఎస్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవద్దంటూ హైకోర్టు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube