ముద్దు కావాలని అడిగిన లాస్య.. రవి ఏమన్నాడంటే..?

రాజకీయ, సినీ రంగాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత శత్రువులు ఉండరనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం సుధీర్ రష్మీ జోడీకి క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో ఒకప్పుడు రవిలాస్య జోడీకి కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉండేది.

 Anchor Ravi Lasya Comedy Stars Promo Goes Viral In Social Media , Comedy Stars S-TeluguStop.com

కానీ లాస్య రవిపై ఆరోపణలు చేయడం ఆ తరువాత రవికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో రవిలాస్య శత్రువులుగా మారారు.బిగ్ బాస్ సీజన్ 4లో లాస్య పాల్గొన్న సమయంలో రవి లాస్యను ఏ మాత్రం సపోర్ట్ చేయలేదు.

అయితే బిగ్ బాస్ షో తర్వాత మళ్లీ సినిమా ఆఫర్లతో బిజీ కావాలని భావిస్తున్న లాస్య రవితో కలిసి కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేస్తున్నారు.ఈ స్కిట్లు ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి.

తాజాగా రవిలాస్య స్కిట్ కు సంబంధించిన కామెడీ స్టార్స్ ప్రోమో విడుదలైంది.రవిలాస్య చిరంజీవి హీరోగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కథాంశంతో స్కిట్ చేశారు.

ప్రోమోలో లాస్య అందాలలో మహోదయం పాటతో ఎంట్రీ ఇస్తారు.ఆ తరువాత లాస్య శేఖర్ మాస్టర్ తో మానవా.! నువ్వు అచ్చం మా జనకుడిలాగే ఉన్నవ్ అని అనగా వర్షిణి శేఖర్ మాస్టర్ అందరికీ జనకుడే అని పంచ్ వేస్తారు.అనంతరం రవి సెల్ ఫోన్ లో వీడియో చూస్తుండగా లాస్య వాళ్లు మూతులు మూతులు భలే నాక్కుంటున్నారు అని సెల్ ఓన్ లో లిప్ లాక్ వీడియో గురించి చెబుతారు.

ఆ తరువాత రవి వాళ్లు ముద్దు పెట్టుకుంటున్నారని ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ చెబుతాడు.ఆ తరువాత లాస్య నాకు కూడా ముద్దు కావాలని అడగగా రవి ఇన్ని సంవత్సరాల నుంచి ముద్దుకోసమే ఎదురు చూస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.

రవి అలా అనడంతో శేఖర్ మాస్టర్ రవి ఇప్పుడు క్యారెక్టర్ నుంచి బయటకొచ్చాడని కామెంట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube