బిగ్ బాస్ బ్యూటీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఓవర్ చేస్తోందంటూ..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కొన్ని వారాలే ఉన్నా దివి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనడానికి ముందే దివి కొన్ని సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు.

 Netizens Trolling  Bigg Boss Divi Over Her Acting In Protein Mart Ad , Bigg Boss-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో ముక్కుసూటితనంతో వ్యవహరించి దివి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.బిగ్ బాస్ షో తర్వాత దివికి సినిమా ఆఫర్లు కూడా పెరిగాయి.

దివి సోషల్ మీడియాలో సైతం తెగ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.ఫోటో షూట్ లలో పాల్గొని ఆ ఫోటోలను షేర్ చేయడంతో పాటు యాడ్స్ లో నటిస్తూ దివి బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ప్రోటీన్ మార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న దివి తాజాగా అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే ఆ వీడియోను చూసిన నెటిజన్లు దివి ఓవర్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఈ యాడ్ లో దివి డైలాగులను సాగదీసి చెబుతూ వంట మనిషితో దురుసుగా ప్రవర్తిస్తారు.వంట మనిషి చేప కూర చేయగా నాకు నీ మీద నమ్మకం లేదని దివి చెబుతారు.ఆ తరువాత వంటమనిషి ప్రోటీన్స్ నాన్ వెజ్ మార్ట్ నుంచి తీసుకొచ్చానని చెబుతుంది.దివి వెంటనే నాకు నీపై నమ్మకం లేకపోయినా ప్రోటీన్స్ పై నమ్మకం ఉందంటూ యాడ్ చేశారు.

అయితే యాడ్ లో దివి ఓవర్ యాక్షన్ ఎక్కువైందని యాడ్ చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి తనకు సీఫుడ్ అంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే.

బిగ్ బా షోకు ముందు మహర్షి సినిమాతో పాటు పలు సినిమాల్లో దివి నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube