మహేంద్ర సింగ్ ధోని.టీమిండియాకు దొరికిన ఓ ఆణిముత్యం.
తన అద్భుత ఆటతీరుతో పాటు చక్కటి నాయకత్వంతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.ఒక వరల్డ్ కప్, ఒక టీట్వంటీ కప్ తన కెప్టెన్సీలోనే సాధించిపెట్టాడు.
తన ఆటతీరు, కెప్టెన్సీ, గెలుపోటముల్లో కనబరిచే స్థితప్రజ్ఞతను ధోని నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సిందే.తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో రికార్డులు సాధించాడు జార్ఘండ్ డైనమైట్.వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
కెప్టెన్ గా ఎక్కువ అంతర్జాతీయ మ్యాచులు ఆడిన క్రికెటర్
ఎంఎస్ ధోని తన క్రికెట్ కెరీర్ లో అన్ని ఫార్మట్లలో 332 అంతర్జాతీయ మ్యాచులకు కెప్టెన్ గా ఉన్నాడు.ఇందులో 178 సార్లు భారత్ విజయం సాధించింది.
ఎక్కువ స్టంపౌట్లు చేసిన కీపర్
ధోని ముందు క్రీజులో ఉన్న క్రికెటర్ ఏమాత్రం అటు ఇటు అయినా స్టంపౌట్ కావాల్సింది.ధోని మూడు ఫార్మాట్లలో ఇప్పటి వరకు 538 మ్యాచుల్లో 195 స్టంపౌట్లు చేశాడు.
ఎక్కువ సార్లు నాటౌట్ గా నిలిచిన బ్యాట్స్ మన్
అంతర్జాతీయ క్రికెట్ లో ధోనీ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 142 సార్లు నాటౌట్ గా నిలిచాడు.
వన్డేల్లో తక్కువ కాలంలో నెంబర్ 1 ర్యాంక్
2004లో వన్డే క్రికెట్ లోకి ధోని అడుగు పెట్టాడు.కేవలం 15 నెలల్లోనే ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 అయ్యాడు.
ఎక్కవ సార్లు మ్యాచ్ ను సిక్స్ తో ముగించిన క్రికెటర్
ధోని ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ అనే పేరుంది.ఇప్పటి వరకు తాను 13 సార్లు భారత జట్టును సిక్సర్ కొట్టి గెలిపించాడు.
క్వికెస్ట్ స్టంపర్
ప్రపంచంలోనే క్వికెస్ట్ స్టంపర్ గా ధోని నిలిచాడు.2018లో వెస్టిండిస్ బ్యాట్స్ మెన్ కీమో పాల్ ను 0.08 సెకెన్లలో స్టంపౌట్ చేసి ఆశ్చర్య పరిచాడు.
అన్ని ఐసిసి ట్రోఫీలు గెలిచిన కెప్టెన్
2007లో టీ-20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని తన కెప్టెన్సీలో గెలిపించి రికార్డు సృష్టించాడు.